
పీసీపల్లి: నా తల్లికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వడంలేదని, పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదని రాజానగర్‌కు చెందిన కుమారి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యను విన్నవించింది. వైఎస్సార్ పార్టీ అని పింఛన్ మంజూరు చేయడంలేదని తన బాధను చెప్పుకుంది.
టీడీపీ వారికే బ్రాహ్మణ కార్పొరేషన్..
పర్చూరు: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ కేవలం అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే మేలు చేసే విధంగా పరిమితమైందని అద్దంకి సీమ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టంరాజు కన్నయ్య వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు. గ్రామాల్లో ప్రస్తుతం బ్రాహ్మణ యువత నిరుద్యోగం, పేదరికాన్ని అధిగమించలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి భార్గవ బ్రాహ్మణ స్టడీ సర్కిల్‌ను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని కోరారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్ర స్థాయిలో వివిధ దేవస్థానాలకు ధూప, దీప, నైవేద్యాల స్కీమ్ కింద ఎందరో అర్చకులకు, పూజారులకు జీవన భృతి కల్పించారన్నారు.