ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
Published Tue, Oct 1 2013 1:25 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
యాలాల, న్యూస్‌లైన్:ప్రమాదవశాత్తు మంటలంటుకొని ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని జుంటుపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. యాలాల మాజీ ఎంపీపీ సుమిత్రాదేవికి చెందిన ఇంట్లో మూడేళ్లుగా అదే గ్రామానికి చెందిన గడ్డమీది ఆశమ్మ నివసిస్తోంది. రోజూ మాదిరిగానే సోమవారం ఆశమ్మ ఇంట్లో దేవుడి పటం ఎదుట దీపం వెలిగించి బయటకు వెళ్లింది. ప్రమాదవశాత్తు దీపం కింద పడటంతో ఇంట్లోని వస్తువులకు మధ్యాహ్నం సమయంలో నిప్పంటుకుంది. ఇంట్లోంచి పెద్ద ఎత్తున పొగ రావడాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని సుమిత్రాదేవి కుటు ంబ సభ్యులతో పాటు తాండూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు.
మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులు, దుస్తులు కాలిబూడిదయ్యాయి. అంతేకాకుండా స్థానిక ఆంధ్రాబ్యాంకు నుంచి పంట రుణం కింద తీసుకున్న రూ. 60 వేలతో పాటు రెండు తులాల నాను, భూమికి సంబంధించిన పాసు బుక్కు, విద్యా సంబంధిత సర్టిఫికెట్లు కూడా అగ్నికి ఆహూతయ్యాయని ఆశమ్మ కన్నీటి పర్యంతమైంది. మంటలు వంట గదిలోకి కూడా పాకడంతో సిలిండర్‌కు నిప్పంటుకుంది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సిలిండర్‌ను బయటకు తీసుకొచ్చి మంట లర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2.5 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement