ఇక బయోమెట్రిక్ ఆధారిత వేతనాలు!
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, అమరావతి: కార్పొరేట్ కార్యాలయాల తరహాలో ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు నమోదు విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ఆసుపత్రులు, విద్యాలయాలన్నింటి లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తేనుంది.
ఇప్పటికే తాత్కాలిక సచివాలయంలో ఈ విధానం కొనసాగుతుండగా.. త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య ఆరోగ్య కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. తొలిదశలో చిత్తూరు జిల్లాలో వైద్య ఆర్యోగ శాఖ ఉద్యోగులందరికీ ఫిబ్రవరి 1వ తేదీన వేతనాలను బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మెమో జారీ చేశారు.