రుణమాఫీతో అప్పుల ఊబిలోకి రైతన్న! | The loan waiver raitanna debt trap! | Sakshi
Sakshi News home page

రుణమాఫీతో అప్పుల ఊబిలోకి రైతన్న!

Published Fri, Aug 29 2014 4:03 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

The loan waiver raitanna debt trap!

  •       రైతుల ఆశలపై నీళ్లు చల్లిన 174 జీవో
  •      చాలా మంది అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి
  •      గత్యంతరం లేక రీ షెడ్యూల్ కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ
  •      గంటల వడ్డీతో ప్రైవేటు అప్పులు
  • పలమనేరు: సీఎం చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ హామీ రైతుల పాలిట శాపంగా మారుతోంది. హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో జిల్లాలోని రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ఇటీవల ఆర్థిక శాఖ విడుదల చేసిన 174 జీ వో వారిని నట్టేట ముంచింది. ఈ జీవోలో పేర్కొన్న మేరకు రకరకాల కత్తిరింపులతో చాలా మంది రైతులకు రుణమాఫీ అందని పరిస్థితి నెలకొంది.

    పలువురు రైతులు బ్యాంకుల్లో అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు డబ్బులు చెల్లించలేక రుణాలు రీషెడ్యూల్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోం ది. బ్యాంకర్ల ఒత్తిడి, రైతుల భయాందోళనలు చూసి వడ్డీ వ్యాపారులు రోజు వడ్డీలతో రక్తాన్ని పీల్చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల్లో తీసుకున్న రుణం వడ్డీ, అసలు కట్టలేక ఇబ్బంది పడుతుంటే రీషెడ్యూల్‌తో మరో రుణం పొంది దాన్ని ఎప్పుడు తీర్చాలో అర్థం గాని పరిస్థితుల్లో అప్పులపాలవుతున్నారు.
     
    రుణమాఫీలో కత్తిరింపులకే పెద్దపీట

     
    రుణమాఫీపై ప్రభుత్వం బ్యాంకర్లకు అందించిన గైడ్‌లైన్స్‌లో కత్తిరింపులకే పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. 2013 డిసెంబర్ 31 వరకు బట్వాడా చేసిన పంట రు ణాలు, ఎంటీఎల్‌లు, బంగారం రుణాలు 2014 మా ర్చి 31 వరకు నిల్వ ఉన్నట్లయితేనే వడ్డీతో సహా మా ఫీ అవుతాయని పేర్కొన్నారు. దీంతో పలువురు రైతులు అనర్హత పొందినట్టే. ఇదిగాక 174 జీవోలో పలు షరతులు పెట్టారు. జిల్లాలో 8.7 లక్షల మంది రైతులు రూ.11,180.25 కోట్ల పంట రుణాలను పొం దారు. ప్రభుత్వ మార్గదర్శకాలతో 65 వేల మంది రైతులకు సంబంధించిన దాదాపు రూ.200 కోట్లకు పైగా మాఫీ వర్తించని పరిస్థితి ఏర్పడింది.
     
    ప్రైవేటు అప్పుల కోసం పాట్లు
     
    రుణమాఫీకి అనర్హులని తేలిన రైతులు వెంటనే అ ప్పులు చెల్లించాలని బ్యాంకర్లు ఇప్పటికే గట్టిగా హె చ్చరికలు చేస్తున్నారు. పలువురు రైతులకు నోటీసు లు సైతం అందాయి. ఇప్పటికిప్పుడు ప్రైవేటు వడ్డీ వ్యాపారులు అప్పులిచ్చే పరిస్థితిలో లేరు. దీంతో రీ షెడ్యూల్ చేసుకోవడమే మేలని రైతులు భావిస్తున్నా రు. బ్యాంకు అప్పు చెల్లించి గానీ రీ షెడ్యూల్ చేసుకోలేని పరిస్థితి ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని పలువు రు వడ్డీ వ్యాపారులు రైతుల నుంచి భారీగా వడ్డీ గుంజుతున్నారు.
     
    వడ్డీ పేరిట భారీగా వసూలు
     
    కొందరు వడ్డీ వ్యాపారులు రైతుల అవసరాలను తెలుసుకుని గంట, రోజు వారీ వడ్డీ పేరిట రూ.లక్షకు రోజుకు రూ.ఐదు నుంచి ఏడు వేల దాకా వసూలు చేస్తున్నారు. కంతు వ్యాపారులు, కుదువ వ్యాపారు లూ ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. ఉదయం డబ్బు తీసుకున్న రైతు బ్యాంకు కెళ్లి రెన్యూవల్ చేసుకొని కొత్త రుణం పొంది ఆ డబ్బును తిరిగి తీసుకొ చ్చి ప్రైవేటు వ్యాపారులకు చెల్లిస్తున్నారు. ఈ కారణంగా బ్యాంకు వడ్డీ, ప్రైవేటు వడ్డీ మరింత భారం గా మారాయి. ఇప్పటికే వర్షాలు లేక వేరుశెనగ పంట ఎండిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త అప్పులు ఎలా తీర్చాలో అర్థంగాని పరిస్థితి నెలకొంది.
     
    బయట అప్పు పుట్టడం లేదు
    బ్యాంకులో అప్పు చెల్లించాల్సిందేనంటున్నారు. కనీసం రీషెడ్యూల్ చేసుకుందామన్నా చేతిలో చిల్లిగవ్వ లేదు. వడ్డీ వ్యాపారులేమో భారీగా వడ్డీ అడుగుతున్నారు. వారి వద్దకు వారం రోజులుగా తిరుగుతున్నా అదిగో ఇదిగో అంటూ కాలం గడుపుతున్నారు.
     -వెంకట్రమణారెడ్డి, కొలమాసనపల్లె,  పలమనేరు మండలం
     
    చేతి బదులుకు రూ.ఐదు వేలా
     బ్యాంకులో ఉన్న బంగారాన్ని విడిపించుకుని మళ్లీ అదే బ్యాంకులో పెట్టి గంట లోపు డబ్బు తెచ్చిస్తానని రూ.50 వేలు అప్పు అడిగాను. ఆ కంతంగిడోళ్లు రూ.ఐదు వేల వరకు వడ్డీ అడుగుతున్నారు. మాలాంటోళ్లు ఎక్కడి నుంచి తేవాలా.
     -గుణశేఖర్, ముడివారిపల్లె, పలమనేరు
     
    రుణ మాఫీ అంటూ మోసం చే శారు
    రుణ మాఫీ చేస్తామని న మ్మించి టీడీపీ మమ్మల్ని మోసం చేసింది. బ్యాం కుల్లో తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు నిబంధన లు పెట్టి నట్టేట ముంచేస్తోంది. బ్యాంకుల్లో అప్పు కట్టేందుకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి తెచ్చాం.
     -జయరాం, వీరప్పల్లె, పెద్దపంజాణి మండలం
     
    తీసుకున్న అప్పులు చెల్లించాల్సిందే
    జీవో ప్రకారం చాలా మం దికి రుణమాఫీ వర్తించదు. ప్రభుత్వగైడ్‌లైన్స్‌ను బ్యాం కు ముందు తగిలించాం. మాఫీ వర్తించని వారు వెం టనే అప్పు చెల్లించడం లే దా రీషెడ్యూల్ చేసుకోవా లి. రీ షెడ్యూల్‌లో ప్రభుత్వ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణమిస్తాం. బంగారు రుణాలకు మరింత తక్కువే ఇస్తాం.
    -సత్యనారాయణరావు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్, పలమనేరు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement