రెండో రాజధాని అంశాన్నీ పరిశీలిస్తాం | The second aspect will be considered in the capital | Sakshi
Sakshi News home page

రెండో రాజధాని అంశాన్నీ పరిశీలిస్తాం

Published Tue, Aug 12 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

రెండో రాజధాని అంశాన్నీ పరిశీలిస్తాం

రెండో రాజధాని అంశాన్నీ పరిశీలిస్తాం

శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు అరోమర్ రేవి
 
కడప: ఆంధ్రప్రదేశ్‌కు రెండో రాజధాని ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకుంటామని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు అరోమర్ రేవి తెలిపారు. కమిటీ బృందం సోమవారం వైఎస్సార్ జిల్లా పర్యటనకు వచ్చారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం అరోమర్ రేవి విలేకరులతో మాట్లాడారు. కరువు, వ్యవసాయం, మౌలిక సదుపాయాల పరిశీలన ద్వారా రాయలసీమ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. వికేంద్రీకరణ ద్వారా ప్రాంతాల మధ్య అభివృద్ధితో సమతుల్యతను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానికి నీటి లభ్యతే కీలకమైన అంశమని ఆయన స్పష్టంచేశారు.

రాజధాని ఏర్పాటుకు వీలైనంత మేరకు తక్కువ భూమినే ఉపయోగించుకోవాలని చెప్పారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్యల్లో పడిందని, కొత్త రాజధానిని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని తెలిపారు. రాజ ధాని ఏర్పాటు అంశంపై తాము కేవలం సిఫారసులకే పరిమితమని, అందరికీ న్యాయం జరి గేలా నివేదిక రూపొందిస్తామని వివరించారు.

విద్యార్థుల ఆందోళన

‘రాజధాని రాయలసీమ హక్కు.. కమిటీల పేరుతో కాలయాపన చేయడం తగదు’ అంటూ ఆర్‌ఎస్‌ఎఫ్ (రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్) కమిటీ సభ్యులు సోమవారం శివరామకృష్ణన్ కమిటీ సభ్యుల ఎదుట నిరసన గళమెత్తారు. ‘శివరామకృష్ణన్ కమిటీ గో బ్యాక్’ అంటూ ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement