
జీవితాలు రైలు పట్టాలపై ఛిద్రం
నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాల్సిన వారు క్షణికావేశంతో రైలు పట్టాల మధ్య తమ బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు.
కడప అర్బన్: నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాల్సిన వారు క్షణికావేశంతో రైలు పట్టాల మధ్య తమ బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులను, భార్య పిల్లల ఆశలను ఆవిరిచేస్తున్నారు. జిల్లాలో కడప నుంచి నందలూరు వైపు, కడప నుంచి ఎర్రగుంట్ల వైపు రెండు రైల్వే పోలీసుస్టేషన్‌లు, ఒక ఓపీ స్టేషన్ పరిధిల్లో 2012 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 236 మంది రైలు పట్టాలపై అసువులు బాసారు.
* ఈ సంఘటనల్లో ఈ ఏడాది ప్రధానంగా కొన్ని సంచలనాలు కలిగించాయి. వాటి వివరాలిలా ఉన్నాయి.
* 2012 సంవత్సరంలో 112 కేసులు నమోదు అయ్యూరుు. వాటిలో 99 మరణాల కేసులు, 13 కేసులు ఇతర నేరాలకు సంబంధించినవి.
* 2013లో 104 కేసులు నమోదయ్యూరుు. వీటిలో 96 కేసులు మృత్యువాత కేసులే. 80 మంది వివరాలు తెలిశాయి. మిగిలిన 16 మంది ఎవరనేది ఇప్పటికీ తెలియరాలేదు. వీటిలో ఎనిమిది ఇతర కేసులు.
* 2014లో ఆగస్టు వరకు 54 కేసులు నమోదయ్యూరుు. వీటిలో 41 కేసులు మృత్యువాత పడిన కేసులే. ఈ కేసుల్లో 42 మంది మృతి చెందారు. మిగిలిన 13 కేసులు ఇతర నేరాలకు సంబంధించినవి.
* 2014లో ప్రధానంగా సంచలనం కలిగించిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. జనవరి 27వ తేదీన చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరుకు చెందిన లక్ష్మిరెడ్డి భార్య సావిత్రిని హత్య చేసి రాయచోటి రైల్వేగేటు సమీపంలో మూటగట్టి పడేశారు. హత్యను కప్పిపుచ్చేందుకు కొందరు నిందితులు ప్రయత్నించారు. ఈ సంఘటనలో బంధువుల ఫిర్యాదు మేరకు ఆమెను హత్య చేశారని తేలడంతో రైల్వే పోలీసులు కేసును తాలూకా పోలీసులకు బదిలీ చేశారు. ఆ సంఘటనలో నిందితులను కూడా అరెస్టు చేసి కటకటాలపాలు చేశారు.
* ఈ సంవత్సరం ఆగస్టు 26వ తేదీన సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఒకేషనల్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రభాకర్‌రావు రాయచోటి రైల్వేగేటు సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు.
* ఈ సంవత్సరం మొదట్లో ఫాతిమా మెడికల్ కళాశాల సమీపంలో మాజీ సైనికోద్యోగి మారుతీ (40) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను కమలాపురం ఎస్‌బీఐలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు.
* ఆగస్టు 4వ తేదీన కడప నగరానికి చెందిన ఇద్దరు ఇంటర్మీయట్ విద్యార్థులు స్నేహితులుగా ఉండి రైలు పట్టాల మధ్య తమ జీవితాలను బలి తీసుకున్నారు. ప్రకాష్‌నగర్‌కు చెందిన లోకేష్‌నాయక్, మృత్యుంజయకుంటకు చెందిన శివతేజరెడ్డిలు ఆగస్టు 3వ తేదీన ఫ్రెండ్‌షిప్‌డే చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమో, ఇతరత్రా కారణాలతోనో ఆత్మహత్యకు పాల్పడ్డారు. లోకేష్‌నాయక్ తన మరణానికి కొన్ని రోజుల ముందు ‘ఐ వాంట్ టు డై’ అని నోటు పుస్తకంలో రాసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరి మరణం వెనుక అసలు కారణాలను ఇంకా రైల్వే పోలీసులు విచారిస్తున్నారు.
* అలాగే గత ఏడాది చివరిలో మాధవరానికి చెందిన జె.రవి అనే యువకుడు ఓబులవారిపల్లె ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. డబ్బును పంచేందుకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకు వస్తుండగా చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలో దోపిడీ జరిగింది. తర్వాత ఒంటిమిట్ట సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
* బద్వేలు సుమిత్రానగర్‌కు చెందిన కొత్తకోట రమేష్‌బాబు అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన భాకరాపేట సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను తాను చనిపోతున్నానని, ఎవరికీ సంబంధం లేదని, తల్లిదండ్రులు బాధపడవద్దని చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
* కడప నబీకోటలో నివసిస్తూ ఒంటిమిట్ట హౌసింగ్ ఏఈగా పనిచేసి అనారోగ్యంతో సంవత్సరకాలంగా ఇంటి వద్దనే ఉన్న సింగారెడ్డి రామిరెడ్డి (51) ఆగస్టు లో రాయచోటి రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. ఇలా క్షణికావేశానికి లోనై రైలు పట్టాల మధ్య తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు.