మన్యంలో మావోయిస్టులు ఇక మనుగడ సాగించలేరని జిల్లా ఎస్పీ కె.ప్రవీణ్, చింతపల్లి డీఎస్పీ ఈ.జి.అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం చింతపల్లి వచ్చిన ఎస్పీ దళసభ్యులను హతమార్చిన గిరిజనులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలో మావోయిస్టుల చర్యల వల్ల గిరిజనులు పలు విధాలుగా నష్టపోయారన్నారు. కొన్నేళ్లుగా మావోయిస్టులపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అవకాశం కోసం ఎదురుచూశారన్నారు.
సాగులలో గిరిజనులు తిరగబడినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. ఫలితంగానే ఈరోజు బలపంలో మావోయిస్టులను గిరిజనులే స్వచ్ఛందంగా హతమార్చారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. బూజుపట్టిన సిద్ధాంతాలను కోసం పనికిమాలిన పోరాటాలు చేయకుండా ఇప్పటికైనా మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని లేకుంటే ప్రజలే సరైన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ ప్రసాద్, ఎస్‌ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు.
మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ
మావోయిస్టుల చర్యలకు నిరసనగా సోమవారం చింతపల్లిలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. బలపంలో మావోయిస్టులు హతమార్చిన సంజీవరావు మృతదేహంతో ఈ ర్యాలీని నిర్వహించారు. ఆధ్యాత్మిక భావంతో మాలలు వేసుకొని పూజ లు చేస్తున్న గిరిజనులను అన్యాయంగా హతమారుస్తున్నారంటూ గిరిజనులు వాపోయారు. మావోయిస్టుల ఆగడాలను ఇక ముందు సాగనీయబోమని ప్రతీనబూనారు. మృతుల బంధువులతో పోలీస్‌స్టేషన్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. వారిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు.
మావోయిస్టులకు మనుగడ లేనట్టే
Published Tue, Oct 21 2014 1:44 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement