
సాక్షి, అమరావతి: భూ సేకరణ సవరణ చట్టంపై కేంద్ర సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కనబెట్టింది. కేంద్ర భూ సేకరణ చట్టం– 2013కు ఎలాగైనా సవరణలు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొంద డానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్‌ఫరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్‌మెంట్ (ఆంధ్రప్రదేశ్ భూ సేకరణ సవరణ చట్టం–2017) బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున కేంద్ర భూ సేకరణ చట్టానికి సవరణలు సరికాదని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని, ఆ రెండు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌కు పోలిక లేదని కూడా పేర్కొంది. 2013 భూ సేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు ఆహార భద్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని, బహుళ పంటలు పండే భూములను సేకరించడంతో ఆహా రానికి కొరత ఏర్పడుతుందని, సాగు భూమి కూడా అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తంచేసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభు త్వ నిబంధనలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. ప్రైవేట్ రంగం వారికి రాష్ట్ర ప్రభుత్వం భూములను ఎలా సేకరించి ఇస్తుందని ప్రశ్నించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గతంలో పంపిన సవరణ బిల్లులో అనేక లోపాలుండటంతో ఆ బిల్లును కేంద్రం రాష్ట్రానికి తిప్పి పంపింది. ఈ నేపథ్యంలో తిప్పి పంపిన బిల్లును ఇటీవల ఉపసంహ రించుకున్న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కొత్త సవరణలతో బిల్లును అసెంబ్లీలో ఆమో దించి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది.
రాష్ట్రానికి ఆహార భద్రత ముప్పులేదు..
కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఇచ్చింది. కొత్తగా 12 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకు వస్తున్నందున రాష్ట్రానికి ఎటువంటి ఆహార భద్రత ముప్పు లేదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment