నా భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారు | Three arrested in cheating case | Sakshi
Sakshi News home page

నా భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారు

Published Tue, Nov 11 2014 6:37 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

నా భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారు - Sakshi

నా భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారు

ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకున్న భర్త
ఏలూరు (వన్‌టౌన్) : తన భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారని, రక్షించాలని కోరుతూ ఓ భర్త ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు మండలం గవరపేట 50వ డివిజన్‌లో నివాసం ఉండే చొచ్చుపల్లి శ్రీనివాస్ భార్యను తంగెళ్లమూడి ఎమ్మార్సీ కాలనీకి చెందిన మణి అనే వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలు తీసుకువెళ్లిపోయిందని, దీంతో తన భార్యను పంపించాలని కోరితే ఖర్చులకు డబ్బులిస్తామంటున్నారని వాపోయాడు. బలవంతంగా తన భార్యను నిర్భందించి వ్యభిచారం చేయించడమే కాక భార్యను పంపాలని అడిగితే చంపుతానని, కొడతానని బెదిరిస్తున్నారని, దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చే శాడు.

తనకు ఆరోగ్యం బాగోలేదని, పిల్లలు రాఘవస్వామి (8), మల్లేశ్వరస్వామి (7) అనాథలుగా రోడ్లపై తిరుగుతున్నారని, మా కుటుంబాన్ని రక్షించాలంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ఏలూరులో యథేఛ్ఛగా జరుగుతున్న వ్యభిచారాన్ని అరికట్టాలని, తన భార్య లాంటి ఎంతో మంది వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్నారని బాధితుడు తెలి పాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ కె.భాస్కర్ కేసును దర్యాప్తు చేయాలని డీఎస్పీ కేజీవీ సరితను ఆదేశించారు. నగరంలో చాపకింద నీ రులా సాగుతున్న వ్యభిచార కేంద్రాలపై ఇప్ప టికైనా పోలీసు శాఖ దృష్టి సారించాల్సి ఉంది.
 
చీటింగ్ కేసులో ముగ్గురి అరెస్ట్
నరసాపురం (రాయపేట) : పట్టణ పరిధిలోని చినమామిడిపల్లిలో చీటిపేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై జాన సతీష్ చెప్పారు. నిందితులు వెలిది వెంకటమహాలక్ష్మీ, ఆమె భర్త పుల్లయ్య, వీరి కుమారుడు కుమార్‌లను సోమవారం అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు. కొంతకాలంగా చీటీల వ్యాపారం నిర్వహిస్తూ రూ.70 లక్షలకు కుచ్చుటోపి పెట్టిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement