అనంతపురం జిల్లా పెనుకొండ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని రైల్వే గేటు వద్ద ఆదివారం ఉదయం ట్రాఫిక్ జామ్ నెలకొంది.
అనంతపురం జిల్లా పెనుకొండ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని రైల్వే గేటు వద్ద ఆదివారం ఉదయం ట్రాఫిక్ జామ్ నెలకొంది. రైల్వే గేటు మరమ్మతుల్లో ఉందని అప్పటికప్పుడు రైల్వే సిబ్బంది బోర్డు తగిలించి.. మరమ్మతు పనులు మొదలుపెట్టారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా గేటు మూసివేయడంతో ఆర్టీసీ బస్సులతోపాటు ఇతరత్రా వాహనాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గేటు వద్ద వాహనాలను టర్న్ తీసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.