- అవినీతి, అక్రమాలపై ప్రజాప్రతినిధుల ధ్వజం
- ఐఎస్‌ఎల్ పేరిట రూ.17.36 కోట్ల స్కాంపై నిరసన
- కాంగ్రెస్ ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎంపీ, ఎమ్మెల్యేల ఆందోళన
- కలెక్టర్ బాబు టీమ్‌కు కితాబు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉట్నూరు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పాలక మండలి సమావేశం గరం గరంగా సాగింది. ప్రొటోకాల్ నుంచి మొదలుకుని పలు సంక్షేమ, అభివృద్ధి పనుల అమలులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై రచ్చ రచ్చ అయ్యింది. సుమారు మూడేళ్ల మూడు నెలల తర్వాత శుక్రవారం ఉట్నూరులోని కొమురం భీమ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం, అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. అటవీశాఖ, డ్వామా, హౌసింగ్, ఐటీడీఏ ద్వారా అమలవుతున్న పథకాలు, ఐఏపీ, ఆర్‌ఐడీఎఫ్, ఈజీఎస్ నిధుల కేటాయింపులో వివక్ష జరుగుతోందంటూ ధ్వజమెత్తారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం కింద ఓ ప్రైవేట్ ఏజెన్సీకి రూ.17.36 కోట్లు కట్టబెట్టడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని, వెంటనే తీర్మానం ఆమోదించాలంటూ ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో సభ్యులు పట్టుబట్టారు. సుమారు ఆరు గంటలపాటు జరిగిన సమావేశం ఏజెండాలో 23 అంశాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రధానాంశాలపైనే చర్చ సాగింది. ఈ సందర్భంగా ఎంపీ రాథోడ్ రమేశ్, ముథోల్ ఎమ్మెల్యే ఎస్.వేణుగోపాలాచారి, ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్య మధ్య పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుంది.
మంత్రి సారయ్య ఫ్లెక్సీలు,{పొటోకాల్‌పై వివాదం
ఐటీడీఏ పాలకమండలి సమావేశం సందర్భంగా కొమురం భీమ్ కాంప్లెక్స్ ఆవరణలో ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్యతోపాటు ప్రభుత్వం, పార్టీ ప్రతినిధుల ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేయడంపై ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు రాథోడ్ రమేశ్, జి.వివేక్, ఎమ్మెల్యేలు గోడం నగేశ్, జోగు రామన్న, కావేటి సమ్మయ్య, గడ్డం అరవిందరెడ్డి, నల్లాల ఓదేలు, రాథోడ్ సుమన్‌బాయి తదితరులు నిరసన వ్యక్తం చేశారు. ‘ఫ్లెక్సీలు తొలగిస్తే తప్ప సమావేశానికి హాజరుకామని’ సమావేశ మందిరానికి వెళ్లకుండా సమీపంలోని అతిథి గృహానికి చేరుకున్న వారు సుమారు గంటపాటు తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఎంపీ రాథోడ్ రమేశ్ ‘ఇది కాంగ్రెస్ పార్టీ సమావేశమా? లేక ఐటీడీఏ పాలకమండలి సమావేశమా? అర్థం కావడం లేదు’ అంటూ కలెక్టర్ అహ్మద్ బాబు, ఐటీడీపీ పీవో జనార్దన్ నివాస్ దృష్టికి తీసుకెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. ఇంతలో సమావేశం మందిరానికి చేరుకున్న ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్య పరిస్థితి తెలుసుకుని ఎంపీలు, ఎమ్మెల్యేలను సమావేశానికి ఆహ్వానించారు. దీంతో సమావేశ మందిరానికి చేరుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫ్లెక్సీల వివాదం తేల్చాకే సమావేశాన్ని ప్రారంభించాలని పట్టుబట్టగా మంత్రి సారయ్య, కలెక్టర్ అహ్మద్ బాబుల ఆదేశం మేరకు పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించడంతో గొడవ సద్దు మణిగింది. ఫ్లెక్సీల వివాదం సద్దుమణిగిన తర్వాత తమ నియోజకవర్గంలోని కడెంలో తాను లేకుండా అభివృద్ధి పనులు మంత్రి సారయ్య ప్రారంభించారని ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ ప్రోటోకాల్ వివాదం లేవనెత్తారు. ఐటీడీఏ అధికారుల ద్వారా ముందే సమాచారం పంపించామని కలెక్టర్ అహ్మద్ బాబు సమాధానం చెప్పారు.
రూ.17.36 కోట్ల స్కాంపై విచారణకు డిమాండ్
జిల్లాలో లక్ష మరుగుదొడ్ల నిర్మాణం పేరిట గతంలో పనిచేసిన అధికారులు కొందరు ఎంపీడీవోల ద్వారా ఓ కాంట్రాక్టర్‌కు రూ.17.36 కోట్ల మేరకు చెల్లించి స్కాంకు పాల్పడ్డారంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మూడు వేలకు దాటని వ్యక్తి మరుగుదొడ్ల(ఐఎస్‌ఎల్)కు టూల్ కిట్స్ పేరిట ఓ కాంట్రాక్టర్ రూ.17.36 కోట్లు చెల్లించిన అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని ఎంపీ రాథోడ్ రమేశ్ పట్టుపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్, ఉపాధి హామీ పథకం కోసం ఏటా రూ. కోట్లు ఖర్చు చేస్తున్న అధికారులు సక్రమంగా ఖర్చు చేయకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఎంపీ అసంతృ ప్తిని వ్యక్తం చేశారు. హౌ సింగ్‌లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ అహ్మద్ బాబు ఐఎస్‌ఎల్‌ల నిర్మాణంపై సర్వే చేసి ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక పంపామని పేర్కొనగా, ఇన్‌చార్జి మంత్రి సారయ్య వి జిలెన్స్ విచారణకు ఆదేశించనున్నట్లు ప్రకటిం చారు. కాగా వామపక్ష తీవ్ర ప్రాబల్యం గల ప్రాంతాల్లో మంజూరు చేసే ఐఏపీ నిధుల విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు జోగు రామన్న, కావేటి సమ్మయ్య, గోడం నగేశ్, ఆత్రం సక్కు, సముద్రాల వేణుగోపాలాచారి ఆందోళన వ్యక్తం చేశా రు. గిరిజన సమస్యలపై అవగాహన లేకుండా రూ.28 కోట్లతో ఆమోదించిన పనులను తక్షణ మే రద్దు చేసి ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసే ప్రతి పాదనలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పనులు ఆమోదం లభించిందని, వాటిని రద్దు చేసే అవకాశం లేదని కలెక్టర్, పీవో వివరించారు.
ఎంపీ వ్యాఖ్యలపై నిరసన
మూడేళ్ల తర్వాత జరిగిన ఉట్నూరు ఐటీడీఏ పా లకమండలి సమావేశం సుమారు ఆరు గంటల పాటు వాడివేడీగా సాగింది. హౌసింగ్, అటవీ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థల్లో అవినీతి పెచ్చుపెరిగిందని, అవినీతి అధికారులపై చర్య లు తీసుకునే వారే లేరని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశ, రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోతే జిల్లాలో కాంగ్రెస్ నేతలు, అధికారుల కారణంగా అవినీ తి పెచ్చరిల్లిందని, అడవులను సంరక్షించాల్సిన అటవీశాఖ అధికారులు, డీఎఫ్‌వోలు దొంగలు గా మారి స్మగ్లర్లకు సహకరించారంటూ ఎంపీ రాథోడ్ రమేశ్ తీవ్రమైన వ్యాఖ్య లు చేయడంపై డీఎఫ్‌వోలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జన్నారం డీఎఫ్‌వో రామకృష్ణారావు అటవీశాఖ అనుమతులకు సంబంధించి వివరణ ఇస్తున్న సమయంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలపై వారు తీ వ్రంగా ప్రతిఘటించి నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ తమను దొంగలంటూ నిరాధారమైన ఆ రోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొనగా... ఆధారాలతో నిరూపిస్తామంటూ ఎంపీ రమేశ్ సవాల్ చేయడంతో ఇరువర్గాల మధ్యన వాగ్వాదం పెరగడంతో మంత్రి సారయ్య జోక్యం చేసుకుని శాంతింప జేశారు. నిజంగానే ఆధారాలుంటే చర్యలు తీసుకుందామని మంత్రి సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
మీరొచ్చాకే పరిస్థితి మారింది..
పాలక మండలి సమావేశం ఆద్యంతం నిరసన లు, ఆందోళనలు, విమర్శలు, వాగ్వాదాల మ ధ్యన అవినీతి, అక్రమాలపై చర్చ జరిగినా.. ‘మీరొచ్చాకా జిల్లాలో పరిస్థితి మారింది’ అం టూ చివరకు కొందరు ప్రజాప్రతినిధులు కలెక ్టర్ అహ్మద్ బాబు టీమ్‌కు కితాబు ఇచ్చారు. ఫె ్లక్సీల ఏర్పాటు, ప్రోటోకాల్ వివాదంపై రగిలిన సభ్యులు ప్రజాప్రతినిధులను కలుపుకుని ఇంకా పనిచేయాలంటూ వారికి ధీమా ఇచ్చారు. బ యోడీజిల్ మొక్కల పెంపకం మొదలుకుని, ఐఎస్‌ఎల్ టూల్‌కిట్స్ పంపిణీ వరకు స్కామ్‌లకు నిలయంగా మారిన సమయంలో రెండున్నర మాసాలుగా పాలన కొంత గాడిన పడినట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు.
కాగా మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు రాథోడ్ రమేశ్, జి.వివేక్, ఎమ్మెల్యేలు గోడం నగేశ్ గడ్డం అరవింద రెడ్డి, జోగు రామన్న, సముద్రాల వేణుగోపాలాచారి, కావేటి సమ్మయ్య, సుమన్ రాథోడ్, ఆత్రం సక్కు, నల్లాల ఓదేలు, గుండా మల్లేశ్, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి హాజరు కాగా ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, నిర్మల్ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డి గైర్హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ సుజాత శర్మ, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు వినయ్ కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డిలు, జిల్లా అటవీశాఖాధికారి తిమ్మారెడ్డి, పీఆర్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, ట్రాన్స్‌కో ఎస్‌ఈలు ఉమా మహేశ్వర్‌రెడ్డి, హంసారెడ్డి, ఇంద్రసేన్, అశోక్‌లు, జేడీఎ రోజ్‌లీల, డీ ఎంహెచ్‌వో డాక్టర్ స్వామి, డీఎప్‌వోలు శేఖర్‌రెడ్డి, వినోద్, రామకృష్ణారావులతోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.