మహదేవపూర్, న్యూస్‌లైన్ : వ్యవసాయమే జీవనాధారం... తెల్లారితే పనుల్లో మునిగిపోయేవారు.. రోజువారీలాగే పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న ఆ దంపతులను ఒర్రె రూపంలో మృత్యువు కబళించింది. ఎడ్లను ఒర్రె నుంచి బయటకు తీసుకొస్తున్న క్రమంలో అందులో పడి దంపతులు మరణించిన ఘటన మహదేవపూర్‌లో చోటుచేసుకుంది.
బంధువుల కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన రైతు దంపతులు బండారి గట్టయ్య(50), ప్రమీల(42) వ్యవసాయమే జీవనాధారంగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికున్న ఐదెకరాల్లో పత్తి, మిర్చి పంటలు వేశారు. మంగళవారం గోదావరి ఒడ్డున ఉన్న తమ పత్తి చేనులోకి వెళ్లి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో వారి ఎద్దులు ఒర్రెలోకి దిగారుు. ఒర్రెలో నీళ్లు బాగా ఉండడంతో వాటిని బయటకు తీసుకొచ్చే క్రమంలో భార్యాభర్తలిద్దరూ ప్రమాదవశాత్తు ఒర్రెలో పడి మృతిచెందారు.
వారు రాత్రరుునా రాకపోవడం, ఎడ్లు మాత్రమే ఇంటికి చేరుకోవడంతో బంధువులు చేనులో వెతికారు. రాత్రి కావడంతో ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం వెతికే క్రమంలో ఒర్రెలో మృతదేహాలు కనిపించాయి. సమాచారాన్ని పోలీసులకు అందించి మృతదేహాలను బయటకు తీసి మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గోదావరి ఒడ్డున ఖననం చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు చంద్రశేఖర్, మహేశ్, కుమార్తె సుమ ఉంది.
పంట చేలు మేస్తాయని...
ఒర్రె ఆవల ఉన్న చేలల్లోకి వెళ్లి పంట మేస్తే ఆ రైతులు తిడతారనే ఉద్దేశంతోనే ఎద్దులు ఆపే క్రమంలో గట్టయ్య, అతడి భార్య ప్రమీల ఒర్రెలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల గోదావరికి వచ్చిన వరదతో ఒర్రె నిండడం, ఇద్దరికి ఈత రాకపోవడంతోనే వారు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇతర రైతులు తిడతారనే బాధతో ఎడ్లను పట్టుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయినట్లయింది.
పంటను మింగింది.. వారిని మింగింది..
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాలుగైదు సార్లు గోదావరి వరద నీరు చేలల్లోకి చేరి పంటలను ముంచెత్తింది. దీంతో పత్తి మొక్కలు కుళ్లి పనికి రాకుండా పోయూరుు. గట్టయ్య చేనును కూడా వరదనీరు ముంచెత్తడంతో నాలుగుసార్లు పత్తి గింజలు నాటాడు. ‘గోదావరి వరద నీరు పత్తి చేనునే కాదు.. మిమ్ముల్ని కూడా మింగిందా..’ అంటూ బంధువులు, కుటుంబసభ్యులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
పలువురి పరామర్శ
రైతు దంపతుల పిల్లలను వివిధ పార్టీల నాయకులు పరామర్శించారు. మహదేవపూర్ సర్పంచ్ కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీపతిబాపు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుట్ట మధు, నాయకులు వామన్‌రావు, బాబోద్దీన్ పరామర్శించారు. అంత్యక్రియల కోసం తాత్కాలిక సాయంగా రెవెన్యూ శాఖ, ఐకేపీ రూ.5 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు.
దంపతులను మింగిన ఒర్రె
Published Thu, Sep 26 2013 4:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement