ఇద్దరు వ్యక్తులు అరెస్ట్: పీఎస్ ఎదుట గ్రామస్తుల ఆందోళన | Villagers protests at police station in machilipatnam | Sakshi
Sakshi News home page

ఇద్దరు వ్యక్తులు అరెస్ట్: పీఎస్ ఎదుట గ్రామస్తుల ఆందోళన

Published Sat, Apr 4 2015 8:13 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

Villagers protests at police station in machilipatnam

మచిలీపట్నం: చోరీ కేసులో కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను మచిలీపట్నం పట్టణ పోలీసులు శుక్రవారం ఆర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి మచిలీపట్నంలోని రూరల్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు శనివారం తెల్లవారుజామున పోలీసు స్టేషన్కు చేరుకున్నారు.

సదరు వ్యక్తులు ఇద్దరు అమాయకులని వారిని వెంటనే విడుదల చేయాలని గ్రామస్తులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో వారు స్టేషన్లోకి చొచ్చుకుని వెళ్లి... కిటికి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దాంతో పోలీసు స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు రూరల్ పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. గ్రామస్తులను స్టేషన్ను బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement