రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
అనంతపురం అర్బన్ : ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి ఆయన మంగళవారం అన్ని జిల్లాల డీఆర్‌ఓలు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. కలెక ్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ పీహెచ్ హేమసాగర్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని ఏప్రిల్ డెడ్‌లైన్ ఇచ్చామన్నారు. ఇప్పటి వరకూ 40 నుండి 50 శాతం మాత్రమే పూర్తి చేశారన్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చురకంటించారు. ఆధార్ అనుసంధానానికి మీకు ఉన్న సమస్యలు ఏంటని ప్రశ్నించారు. బూత్ స్థాయి అధికారులతో పనిచేయించడంలో విఫలమవుతున్నారన్నారు. ఇప్పటికైనా ఈ ప్రక్రియను వేగవంతం చేసి విధించిన గడువు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
బీఎల్‌ఓలను అప్రమత్తం చేసి ఆధార్ అనుంసధానం ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.వేగవంతం చేయండి :ఓటరు కార్డు ఆధార్ అనుసంధానంపై డీఆర్‌ఓ పీహెచ్ హేమసాగర్ మంగళవారం సాయంత్రం జిల్లాలోని తహశీల్దార్, ఎన్నికల అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలన్నారు.
ఆధార్ అనుసంధానంపై దృష్టి సారించండి
Published Wed, Apr 29 2015 4:43 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
Advertisement