తాము ఏఐసీసీ సభ్యులుగా ఉన్నప్పటికీ రేపటి ఢిల్లీ సదస్సుకు ఆహ్వానం అందలేదని సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలిపారు.
హైదరాబాద్: తాము ఏఐసీసీ సభ్యులుగా ఉన్నప్పటికీ రేపటి ఢిల్లీ సదస్సుకు ఆహ్వానం అందలేదని సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఇక లేదని హైకమాండ్ భావిస్తున్న కారణంగానే తమను పిలవక పోవడానికి కారణమై ఉండవచ్చిన ఎమ్మెల్యేలు జేసీ దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డిలు తెలిపారు. అందుకు సీమాంధ్ర ఎమ్మెల్యేల పట్ల వివక్షత చూపుతున్నట్లుగా కనబడుతోందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో ఇతర సీమాంధ్ర ఎమ్మెల్యేలతో మాట్లాడిన తరువాత దానికి తగ్గ ప్రణాళిక సిద్ధం చేస్తామని వారు స్పష్టం చేశారు.
విభజన బిల్లుపై అసెంబ్లీలో తరగతుల వారీగా ఎమ్మెల్యేలు అభిప్రాయం చెప్పాలని రాష్ట్రపతి కోరామన్నారు. ఆ ప్రకారం చర్చించేందుకు గుడువు పెంచాలని కోరతామని వారు తెలిపారు. ఆ మేరకు సీఎం, సభ కూడా గడువు పెంచాలని రాష్ట్రపతికి సూచించే అవకాశం ఉందన్నారు.