పాలమూరు, న్యూస్‌లైన్: తెలుగు భాష గొప్పదనా న్ని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అన్నిస్థాయిల్లో నూ మా తృభాషకు ప్రాధాన్యతనివ్వాలని కలెక్ట ర్ ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు. గిడుగు రా మ్మూర్తి జ యంతిని పురస్కరించుకొని గతనెల 29న వా యిదా వేసిన మాతృభాషా దినోత్సవం కార్యక్రమాన్ని సోమవారం జిల్లా సాంసృ్కతిక మండలి ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మంది రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ ముఖ్య అ తిథిగా హాజరై ప్రసంగించారు. ప్ర పంచ తెలుగు భాష సదస్సు లు చేపట్టిన నాటినుంచి జిల్లాలో తె లుగు అమలు పై ప్రత్యేక దృ ష్టి నిలిపామన్నారు. అధికారిక ఉ త్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరుగుతున్నాయ ని, ప్ర భుత్వ పనితీరు, ఆయా పథకాలు, ఇతర అంశాలను అన్ని శాఖలను సంబంధించిన సమాచారాన్ని తెలుగులో అందించనున్న ట్లు పేర్కొన్నా రు. వ్యవహారిక భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా అధికారులు తెలుగు అమలు ఎంతవరకు ఆచరించారన్నది ప్రశ్నగా మారిందన్నారు. రాష్ట్ర స్థాయిలో, ఇతర రాష్ట్రాలకు సమాచారాన్ని అందించే సందర్భంలో తప్ప ప్రభుత్వ కా ర్యాలయాల్లో తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలపై జిల్లాస్థాయిలో సమీక్ష జరుపనున్నట్లు తెలిపారు.
ప దోతరగతి విద్యార్థులకు తెలుగులోనే తక్కువ మార్కులు రావడంతో అయోమయం నెలకొం దని, తెలుగు పండితులు భాషా ప్రాధాన్యత దృష్ట్యా పదో తరగతిలో విద్యార్థులందరూ క చ్చితంగా ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్నారు. తె లుగు పత్రికలు, మాధ్యమాలు పెరిగిపోతున్నా తెలుగు భాష అమలులో మాత్రం వెనుకబడి పోతున్నామని, స్థానిక మాండలికాల్లో మా ట్లాడే విధంగా చిన్నారులకు కథల రూపంలో తర్ఫీదునివ్వాలని, చదవడం, రాయడం, మాట్లాడటం వంటి ప్రక్రియల ద్వారా విద్యార్థులు భాషపై పట్టు సాధిం చేలా కృషి చేయాలన్నా రు. జిల్లాలోని సాహిత్య సంపదను కాపాడుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని, అందులో భాగంగానే పాలమూరు యూనివర్సిటీ వద్ద పెద్దస్థాయిలో గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి, పల్లెర్ల రామ్మోహన్‌రావు, ఆచార్య ఎస్వీరామారావు, డీఆర్వో రాంకిషన్, డీపీఆర్వో మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పలువురికి పురస్కారం
గత విద్యా సంవత్సరం పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. వారిలో ఎస్.శివ, జి.నరేశ్, యాస్మిన్ బేగం, జె.ప్రభాకర్‌రెడ్డి, స్వప్న, ఎం.రమేశ్‌కుమార్, ఉమాదేవి, ఈడ్గిస్వాతి, గానం శిరీష, ఎం.రమాదేవి, కుర్వ క్రిష్ణ, ఎం.తేజస్విని, బొల్లారం శ్రావణి, కుందెన కిశోర్ గౌడ్ ఉన్నారు. జిల్లాలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన పలు సాహితీ, కళా సేవా సంస్థల ప్రతినిధులకు కూడా సేవా పురస్కారాలు అందజేశారు.
తల్లిభాషను బతికించుకుందాం
Published Tue, Sep 3 2013 5:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement