కొందామా.. వద్దా! | We will buy Gold or not | Sakshi
Sakshi News home page

కొందామా.. వద్దా!

Published Sun, Jul 26 2015 3:31 AM | Last Updated on Thu, Aug 2 2018 3:54 PM

కొందామా.. వద్దా! - Sakshi

కొందామా.. వద్దా!

 ప్రొద్దుటూరు కల్చరల్ : ఏదైనా వస్తువు ధర తగ్గిందంటే ప్రజలు కొనడానికి క్యూ కడతారు. అయితే బంగారం విషయంలో మాత్రం విచి త్రమైన పరిస్థితి నెలకొంది. రెండు వారాలుగా పుత్తడి ధరలు పతనమవుతున్నా కొనేవాళ్లు మాత్రం ముందుకు రావ డం లేదు. వీటి ధరలు మరింత తగ్గుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారని ఇక్కడి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిన బంగారం ధరలు దిగివస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

శనివారం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.2545, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.2352, వెండి కిలో రూ.34300గా ఉంది. అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఆశించిన రీతిలో కొనుగోళ్లు లేవని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత ధర తగ్గితే తాము భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ప్రతి ఏడాది దాదాపు 2 నుంచి 3 వేలకు పైగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర 2010- 2011 మధ్య కాలంలో అత్యధికంగా దాదాపు రూ.7,900దాకా పెరిగింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.2660 ఉండగా జూన్ 1వ తేదీన రూ.2778,  జూలై 1వ తేదీన రూ.2665 పలికి.. 11 రోజులుగా తగ్గుతూ వస్తోంది. ఈ నెల 13న 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.26350, 22 క్యారెట్ల ధర రూ.24,450, వెండి కిలో రూ.35700 పలికిన ధర 14వ తేదీన రూ.26330, రూ.24420, రూ.35500లకు చేరుకుంది.

24వ తేదీన 10 గ్రాములు బంగారం 24 క్యారెట్ల ధర రూ. 25200, 22 క్యారెట్లు రూ. 23240, వెండి రూ.34200 ఉంది. ధరలు మరింత తగ్గుతాయని మీడియాలో కథనాలు వస్తుండటంతో కొనుగోలుకు ముందుకు ఎవరూ రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. అయితే మరింతగా ధర తగ్గే అవకాశాలు తక్కువని, కొనుగోలుకు ఇదే మంచి తరుణమని చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని ప్యూరిటి తక్కువ గల ఆభరణాలను కొనకుండా బ్యూరో ఇండియన్ స్టాండర్డ్ హోల్ మార్కు ఉన్న వాటినే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
 
 కొనేందుకు మంచి అవకాశం : బుశెట్టి రామ్మెహన్ రావు, బులియన్ మార్కెట్ అసోసియేషన్ మెంబర్
అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు బాగా తగ్గాయి. పుత్తడి కొనేందుకు ఇది మంచి తరుణం. మరింత తగ్గుతుందా.. లేదా అనేది చెప్పలేం.
 
 మార్కెట్‌ను అంచనా వేయలేం :  నిదీష్, రితి జ్యువెలర్స్ షోరూం మేనేజరు
మార్కెట్‌ను అంచనా వేయలేము. బంగారం నిల్వలను విక్రయిస్తుండటం, పుత్తడిపై పెట్టుబడులను విరమించుకుంటుండటంతో ధరలు తగ్గుతున్నాయి. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ధరల తగ్గుదల, పెరుగుదలపై కచ్చితంగా  చెప్పలేని పరిస్థితి.
 
హాల్ మార్కుగల ఆభరణాలను కొనాలి :  వెంకటేష్, మార్కెటింగ్ మేనేజర్
 బ్యూరో ఇండియన్ స్టాండర్డ్  916 హోల్ మార్కు (బిస్) గల ఆభరణాలను మాత్రమే కొనాలి. తక్కువ ప్యూరిటి గల ఆభరణాలను కొని నష్టపోకుండా జాగ్రత్త తీసుకోవాలి.  
 
సంవత్సరం  10 గ్రాముల బంగారం ధర
 2004         రూ.5850
 2005         రూ.7000
 2006          రూ.8400
 2007         రూ.10,800
 2008         రూ.12500
 2009         రూ.14500
 2010         రూ.18500
 2011         రూ.26400
 2012         రూ.29500
 2013         రూ.31200
 2014         రూ.27800

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement