
ఐక్యంగా విభజన బిల్లును వ్యతిరేకిస్తాం: జెసి
అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర శాసనసభ్యులు అందరూ కలిసి ఐక్యంగా విభజన బిల్లును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర శాసనసభ్యులు అందరూ కలిసి ఐక్యంగా విభజన బిల్లును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. విభజన బిల్లు అసెంబ్లీకి రావడం ఆలస్యమైతే సమైక్య ఆంధ్ర తీర్మానాన్ని ప్రతిపాదిస్తామన్నారు. సీమాంధ్ర నేతలెవరూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ను కలవాలని అనుకోవడంలేదని జెసి చెప్పారు.
పార్టీపైన, పార్టీ అధినేత్రి సోనియా గాంధీపైన ఇటీవల కొద్ది రోజులుగా జెసి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు ఆయన మొదటి నుంచి వ్యతిరేక వ్యక్తం చేస్తున్నారు.