ఉన్మాదానికి పరాకాష్ట | young woman murdered in Anakapalli | Sakshi
Sakshi News home page

ఉన్మాదానికి పరాకాష్ట

Published Mon, Mar 20 2017 10:42 PM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

ఉన్మాదానికి పరాకాష్ట - Sakshi

ఉన్మాదానికి పరాకాష్ట

పాత కన్నూరుపాలెంలో గుర్తు తెలియని యువతి హత్య
బ్లేడులతో కోసి, ఆపై దహనం
అత్యాచారం చేసి ఉంటారని అనుమానం


కశింకోట (అనకాపల్లి): గుర్తు తెలియని యువతిని అతికిరాతంగా హత్య చేశారు. కశింకోట మండలంలోని కన్నూరుపాలెం శివారు పాత కన్నూరుపాలెం ప్రాంత పొలాల్లో  యువతి మృతదేహాన్ని చూసిన ఓ రైతు  సమాచారం అందివ్వడంతో సంఘటన ఆదివారం  వెలుగు చూసింది.   మండల శివారున నర్సీపట్నం రోడ్డులో ఉన్న  పాత కన్నూరుపాలెం గ్రామ సమీపంలో నిర్మూనుష్యంగా ఉన్న  ప్రాంతంలోకి గుర్తు తెలియని  యువతి(25)ని ఎవరో తీసుకొచ్చారు. ఆమెను చిత్ర హింసలకు గురి చేశారు. మెడ మీద, ఛాతీ, కడుపు, తొడలపైన బ్లెడ్‌తో కోశారు.  గుర్తు పట్టడానికి వీలులేని విధంగా ఆమెను కాల్చి వేశారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని ఎవరికి తెలియకుండా ఏపుగా  పెరిగి ఉన్న గడ్డిలోకి లాక్కెళ్లి పడేసి వెళ్లిపోయారు. ఆమెపై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చేసి ఉంటారని భావిస్తున్నారు.  సీఐ రామచంద్రరావు, ఎస్‌ఐ బి.మధుసూదనరావు, సిబ్బంది సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగి ఉంటుందని భావిస్తున్నారు.   జాగిలాలు రప్పించారు.   శరీరాన్ని కోయడానికి విని యోగించిన బ్లేడ్‌ లభించింది. యువతి 4 అడుగుల 9 అంగుళాల పొడవు ఉంది. ఎర్ర రంగు జాకెట్, కాషా యి రంగులంగా, తెల్ల రంగుపై ఎరుపు, ఆకుపచ్చ రంగు పువ్వులు ఉన్న చీర ధరించి ఉంది. చామనఛాయ రంగు ఉన్న ఈమె మెడలో రోల్డు గోల్డు గొలుసు  ఉంది. కర్గీస్‌ కంపెనీ చెప్పులు   ధరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు.   హత్య సంఘటనకు స్పష్టమైన కారణాలు    తెలియాల్సి ఉందని, విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు. మృతదేహాన్ని దేనితో కాల్చినది తెలియడానికి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు పంపుతామని  సీఐ రామచంద్రరావు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement