అనంతపురం : అనంతపురంలో ఓ యువతి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. మృతి చెందిన యువతి ఆత్మహత్య చేసుకుందా లేక గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైందానని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని మల్లేశ్వర్ రోడ్ లోఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి స్వస్థలం అనంతపుం జిల్లా యాడికి మండలంలోని వేములపాడు గ్రామం.
దివ్య తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె నగరంలోని ఓ పాలడైరిలో పనిచేస్తూ మల్లేళ్వర్ రోడ్లో తన స్నేహితులతో కలసి ఉంటుంది. కొద్దిరోజుల క్రితమే ఆమె స్నేహితురాలు రూం ఖాళీ చేసి వెళ్లిపోవడంతో దివ్య మాత్రమే ఈ గదిలో ఉంటోంది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఓ యువకుడు తాగివచ్చి ఆమెతో గొడవపడ్డాడు. అయితే స్థానికులు జోక్యం చేసుకుని ఆ యువకుడిని చితకబాది అక్కడ నుంచి పంపించి వేశారు.
కాగా దివ్య కోసం గదికి వెళ్లిన ఆమె స్నేహితురాలు సునీతకు ..... దివ్య మంటల్లో కాలిపోయి మృతి చెంది ఉంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు దివ్య మృతిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెతో గొడవపడిన యువకుడు ఎవరన్నది తెలియడం లేదు. అతనే దివ్యను హత్య చేశాడా? లేక ఆమె ఆత్మహత్య చేసుకుందా..అన్న విషయం పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
అనంతపురంలో యువతి అనుమానాస్పద మృతి
Published Tue, Oct 15 2013 8:42 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
Advertisement
Advertisement