తాళ్లపూడి (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం సమీపంలోని గోదావరి నదిలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. గోపాలపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు శనివారం సాయంత్రం ఈతకు వెళ్లారు. అయితే గోదావరి నదిలో లోతుకు వెళ్లడంతో హేమచంద్ర(21) అనే యువకుడు మృత్యువాతపడ్డాడు. మిగిలిన ముగ్గురు యువకులు అతణ్ణి కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతుడు హేమచంద్ర ఐటీఐ చేశాడని అతని మిత్రులు తెలిపారు.