సాక్షి, సాలూరు : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 294వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం జననేత సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలంలోని తన నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పేకపాడు వరకు వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన 293వ రోజు పాదయాత్ర
వైఎస్ జగన్ 293వ రోజు పాదయాత్ర చప్ప బుచ్చమ్మపేట వద్ద ముగిసింది. నేడు జననేత పాదయాత్ర సన్యాసిరాజుపేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి బాగువలస మీదుగా నక్కడవలస క్రాస్, తడిలోవ, మక్కువ మండలంలోని గునికొండవలస మీదుగా చప్ప బుచ్చమ్మపేట వరకు పాదయాత్ర కొనసాగించారు. నేడు జననేత 9.8కిలో మీటర్లు నడిచారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 3,209.4 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment