
సాక్షి, రాజాం(శ్రీకాకుళం): నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 311వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో అశేష ప్రజానీకం అపూర్వ ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది.
జననేత సోమవారం ఉదయం రేగిడి మండలంలోని బురాడ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొర్లవలస క్రాస్ మీదుగా గురవాం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర రాజాం మీదుగా అంతకాపల్లి వరకు కొనసాగనుంది. రాజాంలో జరిగే భారీ బహిరంగ సభలో జననేత ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 310వ రోజు ముగిసింది. ఆదివారం ఉదయం రాజాం నియోజకవర్గంలోని ఉంగరాడమెట్ట శివారు నుంచి జననేత పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి కుమ్మరి అగ్రహారం, లింగాల వలస, రెడ్డి పేట క్రాస్, తోకలవలస క్రాస్, చిన్న శిర్లాం, లచ్చన్నవలస క్రాస్ మీదుగా బురాడ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. వైఎస్ జగన్ ఇప్పటివరకు 3,360.5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసుకున్నారు.