
మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డికి జగన్ నివాళి
కుటుంబసభ్యులకు పరామర్శ
అనంతపురం: అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి(బీఎన్‌ఆర్) భౌతికకాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోమవారం సందర్శించి నివాళులర్పించారు. నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని అనంత పురంలోని స్వగృహానికి తీసుకొచ్చి సోమవారం మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఉంచారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు నుంచి నేరుగా బీఎన్‌ఆర్ ఇంటికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళుల ర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
బీఎన్‌ఆర్ సోదరులైన మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి కన్నీటి పర్యంతమవ్వగా.. జగన్ వారిని ఓదార్చారు. కుటుంబ సభ్యులం దరూ ధైర్యంగా ఉండాలని జగన్ ఓదార్చారు. అనంతరం బీఎన్‌ఆర్ భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమి త్తం ప్రత్యేక రథంలో బీఎన్‌ఆర్ సొంతూరైన కణేకల్లు మండలం పెనకల పాడుకు తీసుకెళ్లారు. భౌతికకాయాన్ని కొంతసేపు అక్కడి ప్రజల సందర్శ నార్థం ఉంచి అనంతరం ఆయన పొలంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.