రాజమండ్రి బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి బయల్దేరారు. హైదరాబాద్ నుంచి ఆయన విమానంలో మధురపూడి చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వైఎస్ జగన్ జగ్గంపేట మీదుగా ఇర్రిపాకకు వెళ్తారు.
సోదరుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇటీవల నెహ్రూ సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జ్యోతులను పరామర్శించిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి తుని మీదుగా విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం గోకులపాడు వెళ్తారు. అక్కడ ఇటీవల బాణసంచా పేలుడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు.