రైతు సమస్యలపై గవర్నర్ను కలిసిన వైఎస్ జగన్
రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, రైతులు.. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిశారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి రైతులను చిత్రహింసలు పెడుతున్నారని గవర్నర్కు తెలిపారు. పంటల దహనకాండకు తామే బాధ్యులమని ఒప్పుకోవాలని స్టేషన్లకు పిలిపించి హింసిస్తున్నారని చెప్పారు.
గవర్నర్ను కలిసిన వారిలో గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ రైతు పరిరక్షణ సంఘ సభ్యులు. మరికొందరు రైతులు కూడా ఉన్నారు. స్థానిక నేతలను, భూములు ఇవ్వబోమని చెబుతున్న రైతులను పోలీసు స్టేషన్లలో ఉంచి చిత్రహింసలు పెడుతున్నారని ఆయనకు తెలిపారు. తమకు ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా రాజధానికి భూములు ఇవ్వబోమన్న ఒకే ఒక్క కారణంతో తమను హింసించడం సరికాదని గవర్నర్ నరసింహన్కు వైఎస్ జగన్ చెప్పారు.రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆయనను కోరారు.