జిల్లాకు చేరిన జగన్
లావేరు: అభిమానం వెల్లువెత్తింది. జన సంద్రం పోటెత్తింది. కష్టాల్లో ఉన్న హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జిల్లాకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహనరెడ్డికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. లావేరు మండలంలోని సుభద్రాపురం జంక్షన్ వద్దకు రాత్రి 9.10 గంటలకు చేరుకున్న జగన్‌కు పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జ్ సుజయకృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, జిల్లా అధ్యక్షులు రెడ్డి శాంతి, నాయకులు గొర్లె కిరణ్‌కుమార్, బల్లాడ జనార్ధనరెడ్డి,
మామిడి శ్రీకాంత్, పాలవలస విక్రాంత్, ఎం.వి. పద్మావతి, అంధవరపు సూరిబాబు, శిమ్మ రాజశేఖర్, కె.ఎల్. ప్రసాద్, గుమ్మా నగేష్, రణస్థలం జెడ్పీటీసీ గొర్లె రాజగోపాలరావు, మాజీ ఎంపీపీ దన్నాన రాజినాయుడు, మాజీ జెడ్పీటీసీలు టొంపల సీతారాం, సనపల నారాయణరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రొక్కం బాలకృష్ణలతో పాటు లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల వైఎస్సార్ సీపీ కేడర్ అధిక సంఖ్యలో తరలి వచ్చి జగన్‌కు ఘనస్వాగతం పలికారు. జనసంద్రమైన సుభద్రాపురం జంక్షన్‌జగన్ రాకతో లావేరు మండలంలోని సుభద్రాపురం జంక్షన్ జనసంద్రమైంది. సుభద్రాపురం జంక్షన్‌కు జగన్ వస్తున్నారని సమాచారం తెలియడంతో సాయంత్రం ఐదు గంటల నుంచే అధిక సంఖ్యలో జనం బారులు తీరారు.
జగన్ రాక ఆలస్యమైనప్పటికీ మహిళలు, వృద్ధులు, యువత రాత్రి వరకూ ఎదురుచూసి స్వాగతం పలికారు.శ్రీకాకుళం అర్బన్: జగన్ మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి శ్రీకాకుళంలోని ఆర్‌అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్నారు. జిల్లాలో నష్టపోయిన తుపాను బాధితులున మంగళవారం పరామర్శించనున్నారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ హై పవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం, పార్టీ నాయకులు పాలవలస రాజశేఖరం, పాలవలస విక్రాంత్, గొర్లె కిరణ్, ఎం.వి.పద్మా