‘జనభేరి’కిసన్నద్ధం | ys jagan mohan reddy's tour in khammam | Sakshi
Sakshi News home page

‘జనభేరి’కిసన్నద్ధం

Published Sun, Mar 2 2014 1:18 AM | Last Updated on Mon, Aug 27 2018 8:57 PM

ys jagan mohan reddy's tour in khammam

సాక్షి, ఖమ్మం: జననేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జనభేరి సభకు ఖమ్మం ముస్తాబవుతోంది. సార్వత్రిక ఎన్నికల ముంగిట అధినేత జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు  సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఈనెల 5న ఖమ్మంలో నిర్వహించనున్న జనభేరి సభకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానుండగా... సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తారన్న అంచనాతో పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీలపరంగా చూస్తే జిల్లాలోనే వైఎస్సార్ సీపీ తొలి ఎన్నికల ప్రచార సభను నిర్వహిస్తుండటంతో జిల్లా ప్రజల దృష్టంతా ఈసభపైనే ఉంది.

 భారీ ఏర్పాట్లు..
 జగన్ జనభేరి సభకు జిల్లా కేంద్రంలో భారీ ఏర్పాట్లు చేసేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు వచ్చే ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సుమారు రెండేళ్ల తర్వాత జగన్ జిల్లాలో అడుగు పెడుతుండగా.. ఆయనను చూసేందుకు భారీ ఎత్తున జనం కదలనుండడంతో ఆదిశగా నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2010లో జిల్లాలో జగన్ ఓదార్పుయాత్ర చేసిన సమయంలో అనూహ్య స్పందన లభించింది.

ఎక్కడ చూసినా జనసంద్రం కనిపించింది. ఇప్పుడు కూడా అదేరీతిలో జనస్పందన రానుందని పార్టీనేతలు భావిస్తున్నారు. తెలంగాణలో తొలి ఎన్నికల ప్రచార సభ కావడంతో నల్లగొండ, వరంగల్ జిల్లాలనుంచి కూడా నేతలు, కేడర్ తరలి రావడానికి ఇప్పటినుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకు వెళ్లడంతో నాటి వైఎస్ స్మృతులను నెమరువేసుకుంటూ జనభేరి సభకు కదం తొక్కేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ నేతలు ఇప్పటికే గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలతో జనభేరి సభపై చర్చించారు.

 చిన్నారుల కుటుంబాలను  పరామర్శించేందుకు...
 జగన్‌మోహన్‌రెడ్డి 2012 మార్చి 22న జిల్లాలో పర్యటించారు. 2012 మార్చి 20న కొత్తగూడెం-చండ్రుగొండమండలం సరిహద్దులోని పెద్దవాగులో పాఠశాల బస్సు పడి 8 మంది చిన్నారులు మృతిచెందిన విషయం విదితమే. ఈఘటనలో బాధిత కుటుంబాలను ఓదార్చేం  దుకు చండ్రుగొండ మండలంలో అప్పట్లో జగన్ పర్యటించారు. ఆయన ఇచ్చిన ఓదార్పు ఇప్పటికీ ఆ కుటుంబాలు స్మృతికి తెచ్చుకుంటున్నాయి.

అంతేకాకుండా గత ఏడాది ఏప్రిల్ 20 నుంచి మే 12 వరకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిర్వహించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో 22 రోజులపాటు కొనసాగింది. ఈ యాత్రతో  పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడింది. ఇదే ఉత్సాహం పంచాయతీ ఎన్నికల్లో చూపడంతో జిల్లాలోనే అత్యధిక పంచాయతీలపై వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు జెండా ఎగురవేశారు. జిల్లా లో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ చేసిన పర్యటనలు  కూడా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఈనేపథ్యంలో ప్రస్తు తం జనభేరి సభ భారీ ఎత్తున నిర్వహిస్తుండటంతో జిల్లాలోని మారుమూలన ఉన్న కేడర్, ప్రజలు కూడా ఈ సభకు తరలేందుకు ఉత్సాహం చూపుతూ ఏర్పాట్లలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement