వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల పర్యటన నిమిత్తం శనివారం జిల్లాకు వస్తున్నారు.
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల పర్యటన నిమిత్తం శనివారం జిల్లాకు వస్తున్నారు. వైఎస్సార్‌సీపీ, సీపీఎం అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ శని, ఆదివారాల్లో ఆయన జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
షెడ్యూల్ ఇది...
26వ తేదీన ెహ లికాప్టర్ ద్వారా మధిర సుందరయ్య సెంటర్‌కు మధ్యాహ్నం ఒంటిగంటకు జగన్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి సాయంత్రం 4 గంటలకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని, రోడ్‌షో ద్వారా ములకలపల్లి, దమ్మపేట మీదుగా గంగారం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 27వ తేదీ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా మీదుగా ఖమ్మం వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఖమ్మంలో ఇల్లెందు క్రాస్‌రోడ్ నుంచి జడ్పీసెంటర్, బస్టాండ్‌రోడ్, కస్పాబజార్, విజయలక్ష్మి ఆసుపత్రి, చర్చికాంపౌండ్, ఫ్లై ఓవర్, బోస్‌సెంటర్, పీఎస్‌ఆర్ రోడ్, కాల్వొడ్డు, నయాబజార్ కళాశాల వరకు రోడ్‌షో నిర్వహించి జిల్లాలో పర్యటన ముగిస్తారు. అనంతరం ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి హెలీకాప్టర్ ద్వారా మహబూబాబాద్ బయలుదేరి వెళ్తారు.