నవ తెలంగాణ నిర్మాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
న్యూస్‌లైన్: నవ తెలంగాణ నిర్మాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వె ఎస్సార్ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. జగన్ పర్యటన సందర్భంగా ఆదివారం వైరాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కుంటుపడటానికి కిరణ్ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. వైఎస్సార్ పథకాలు అమలు కావాలంటే జగనన్న నాయకత్వంలోనే సాధ్యమవుతుం దన్నారు. ప్రతి పేదకు వైఎస్ హయాంలో న్యాయం జరిగిందని తెలిపారు. జనం కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారని అన్నా రు. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మైక్కై 16 నెలల పాటు జగన్‌ను జైలు పాలు చేశాయని అన్నారు. అయినా ఆయన నిత్యం ప్రజల కోసమే పరితపించారని పేర్కొన్నారు.
వైఎస్సార్ పాలనలో సువర్ణయుగం : వైఎస్సార్ సీపీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్
దివంగత మహనేత డాక్టర్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రం సువర్ణయుగంగా ఉందని, మళ్ళీ అదే సువర్ణయుగం రావాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో మాత్రమే సాధ్యమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ అన్నారు. వైఎస్సార్ జనరంజక పాలన అందించారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని, రాష్ట్రంలో వైఎస్సార్ పాలనకు ముందు ముఖ్యమంత్రులను చూశామని ఆ పాలనకు, వైఎస్‌ఆర్ పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి సీపీఎం బలపరిచిన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తనకు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి బొంతు రాంబాబు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ షేక్ లాల్‌మహ్మద్, నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి బొర్రా ఉమాదేవి, ఐలూరి మహేష్‌రెడ్డి , తాతా నిర్మల పాల్గొన్నారు.