ప్రభం‘జనమై’.. | YS Jagan Praja Sankalpa Yatra Special Story | Sakshi
Sakshi News home page

ప్రభం‘జనమై’..

Published Mon, Jan 7 2019 8:46 AM | Last Updated on Mon, Jan 7 2019 8:46 AM

YS Jagan Praja Sankalpa Yatra Special Story  - Sakshi

వెల్లువెత్తిన జనగోదారి : జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు పోటెత్తిన జనం (ఫైల్‌)

జన్మస్థలమైన నాసిక్‌లో జనియించినప్పుడు గోదావరి చిన్న పాయే. తన గమ్యమైన కడలి దిశగా సాగించిన పయనంలో.. ఎన్నో వాహినులను ఆ నదీమతల్లి అక్కున చేర్చుకుంది. ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ.. లక్షల మంది దాహార్తిని తీరుస్తూ.. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ఆ తల్లి.. రాజమహేంద్రవరం చేరుకునేసరికి అఖండ గోదావరిగా రూపుదాల్చింది.సరిగ్గా అదేవిధంగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలో ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొంటూ.. మొక్కవోని దీక్షతో, చిత్తశుద్ధితో జనహితమే లక్ష్యంగా.. ఆయన సాగిస్తున్న మహాపాదయాత్ర ఎంతోమందికి నూతనోత్తేజాన్నిచ్చింది. ఫలితంగా ఆయనకు తోడుగా లక్షలాదిగా జనం కదిలారు. ఆ అలుపెరుగని పథికుడికి తోడుగా పార్టీలో పెద్ద ఎత్తున చేరారు. ఆయన చేపట్టిన జనహిత యజ్ఞానికి సాయంగా నిలుస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర జిల్లాలో ఒక ఉప్పెనలా సాగింది. అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించింది. పాదయాత్ర విజయవంతం కాకూడదని పాలకపక్షం విశ్వ ప్రయత్నాలు చేసినా ప్రజలు తిప్పికొట్టారు. మాట తప్పని నేతగా, నిరంతరం ప్రజల మధ్యే ఉంటున్న జగన్‌ వెంటే వెళ్తామంటూ, అడ్డంకులు అధిగమించి మరీ పాదయాత్రలో మమేకమయ్యారు. దీంతో జిల్లాలో ఎక్కడికెళ్లినా పాదయాత్ర జనసంద్రమైంది. మునుపెన్నడూ లేనివిధంగా, ఏ నేతకూ రానివిధంగా జనాలు తరలివచ్చారు. మండుటెండలను, జోరు వానలను సహితం లెక్క చేయకుండా.. జిల్లాలో 50 రోజులపాటు 412 కిలోమీటర్ల మేర సాగిన జగన్‌ పాదయాత్రలో.. అడుగడుగునా ఇసుక వేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. పాదయాత్ర ఆద్యంతం మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన లక్షలాది మంది జగన్‌ అడుగులో అడుగు వేశారు. ఎక్కడికక్కడ పార్టీలో పెద్ద ఎత్తున చేరారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లోనూ అంచనాలకు మించి పార్టీ పటిష్టమైంది. ఊహించిన దానికన్నా పాదయాత్రలో జన ప్రభంజనం కనిపించడంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఈ పాదయాత్ర వైఎస్సార్‌ సీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచింది.

పాదయాత్రతో పార్టీ మరింత పటిష్టం
జిల్లాలో సాగిన ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా జగన్‌ సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు పెద్ద ఎత్తున చేరారు.
అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, ప్రముఖ వైద్యుడు పితాని అన్నవరం, ఎన్‌ఆర్‌ఐ దవులూరి దొరబాబు, ఆదర్శ ఇంజినీరింగ్‌ కళాశాల అధినేత బుర్రా అనుబాబు, కొవ్వూరు నియోజకవర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నక్కా శ్రీనగేష్, కార్పొరేటర్‌ కురిమిల్లి అనురాధ, అమలాపురం మున్సిపల్‌ నాయకుడు ఒంటెద్దు వెంకన్నాయుడు తదితర వేలాది మంది నాయకులు జిల్లాలోనే వైఎస్సార్‌ సీపీలో చేరారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ మరింత పటిష్టమైంది.
దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ గెలుపు అవకాశాలు రెట్టింపయ్యాయి. ఈ పరిణామాలతో పార్టీకి మరింత ఊపు వచ్చింది. దీంతో పాదయాత్ర అనంతరం కూడా జిల్లాకు చెందిన పెద్ద నాయకులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ఉన్న మార్గాని భరత్, చింతా అనురాధ, జిల్లా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ నందెపు శ్రీనివాస్, ప్రముఖ నాయకులు బొమ్మన రాజ్‌కుమార్, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు పొలసానపల్లి హనుమంతరావు తదితరులు చేరడం పార్టీకి మరింత బలాన్ని సమకూర్చింది. అలాగే రాజమహేంద్రవరంలో మాజీ కార్పొరేటర్లు ఇసుకపల్లి శ్రీనివాస్, ఎస్‌.రామారావు, చాంబర్‌ మాజీ అధ్యక్షుడు బి.సుబ్బారాయుడు కూడా పార్టీలో చేరారు.
కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం ఎంపీపీ వాకలపూడి వెంకట కృష్ణారావు సోదరుడు, టీడీపీ క్రియాశీలక నాయకుడు వాకలపూడి సుబ్బారావు, మరో క్రియాశీలక నాయకుడు ఎన్‌.చౌదరి తమ అనుచరులతో కలిసి జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. అలాగే టీడీపీకి చెందిన వద్దిపర్రు సర్పంచ్‌ ఉప్పే కొండయ్య, మేడవరపు లక్ష్మణరావు, మాజీ ఉప సర్పంచ్‌ పల్లికొండ గణేశ్వరరావు, పల్లికొండ సహదేవుడు, ఉప్పే బాపిరాజు, పల్లికొండ సత్యనారాయణ, పల్లికొండ ప్రవీణ్, బీరా కిషోర్, జక్కల జాన్‌ప్రసాద్, మానేపల్లి సూరయ్య, వీరవల్లి మోహన్‌రావుతో పాటు మరికొంతమంది టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఆలమూరు మండలానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎస్‌కే షరీఫ్, టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షరాలు పెద్దింటి మంజుల, జిల్లా బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు పెద్దింటి సత్య కామేశ్వరరావు, మేడిద వరలక్ష్మితో పాటు మరికొంతమంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో టీడీపీ నాయకులు కాసాని శ్రీనివాసరావు, బ్రహ్మనందం, మేడిశెట్టి శ్రీనివాసరావుతోపాటు పలువురు పార్టీలో చేరారు. ఆలమూరు మండలం నుంచి వివిధ పార్టీలకు చెందిన తమ్మన గోపాలకృష్ణ, బత్తుల బ్రహ్మనందం తదితరులు చేరారు. రావులపాలేనికి చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, కొవ్వూరి శివమణికంఠరెడ్డి, పోతుమూడి బుజ్జిబాబులు జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు.
రాజోలు నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు రుద్రరాజు వెంకట్రామరాజు, మాజీ ఎంపీపీ నల్లి సుధీర్, సర్పంచ్‌ కందుల సూర్యచంద్రరావు, ఇందుకూరి రామకృష్ణంరాజు, వేగిరాజు సాయిరాజు, దీనబోయిన ఏసుబాబు, రుద్రరాజు చినరాజా, రుద్రరాజు రామలింగరాజు, రుద్రరాజు విశ్వపద్మరాజు, రుద్రరాజు పద్మరాజు, రవిరాజు, అచ్యుతరామరాజు, పెద్ద చంటిరాజు తదితరులు పార్టీకి జై కొట్టారు. రాజోలు మాజీ ఎంపీపీ పాలపర్తి ధనలక్ష్మి, విజయమోహనరావు దంపతులతో పాటు పలువురు నాయకులు కూడా పార్టీలో చేరారు.
పి.గన్నవరం నియోజకవర్గం కె.ముంజవరానికి చెందిన పీసీసీ సభ్యుడు, డీసీసీ ఉపాధ్యక్షుడు కుంపట్ల నాగప్రసాదరావు, మాజీ జెడ్పీటీసీ గ్రంధి అలివేలు నాగమణి, నాగుల్లంక ఎంపీటీసీ బొక్కా ఏడుకొండలు, మాజీ సర్పంచ్‌ మామిడిశెట్టి శివరామప్రసాద్, యూత్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు గంధం ఏసు పార్టీలో చేరారు. మొండెపులంక శివారు జొన్నల్లంకకు చెందిన అగ్నికుల క్షత్రియ నేత కోనేటి రాజు, కొప్పనాతి శ్రీను, చందాడి విజయప్రకాష్, పెమ్మాడి సాయిబాబు, చందాడి సత్యవతి తదిరులు పెద్ద ఎత్తున పార్టీకి జై కొట్టారు.
అమలాపురం నియోజకవర్గంలో మాజీ కౌన్సిలర్‌ ఒంటెద్దు వెంకన్ననాయుడు, తిక్క బాబీ, ఇండుగుల శ్రీనివాసరావు, తిక్కిరెడ్డి సురేష్, ఒంటెద్దు బాబు, గుమ్మెళ్ల సురేష్, పెయ్యల సంధ్య, కంచిపల్లి శ్రీను, గెడ్డం సంపతిరావు, సుంకర ఏసుబాబు, ఆకుల బాలాజీ, మామిడిపల్లి శ్రీనివాస్, జట్టు పద్మరాజు, ఆకుల నాగేశ్వరరావు, ఆకుల సత్యనారాయణ, యర్రంశెట్టి అర్జునరావు, నల్లా సత్యనారాయణ, అన్యం సత్తిబాబు, కోడూరి దుర్గాప్రసాద్, గుండు రాజు, చేగొండి నానాజీ తదితరులు వైఎస్సార్‌ సీపీలో చేరారు.
ముమ్మిడివరం నియోజకవర్గంలో డీసీసీబీ డైరెక్టర్‌ జి.నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ మానేపల్లి సత్యనారాయణ, ముదునూరి సతీష్‌రాజు, రామచంద్రపురంలో పట్నాల పార్వతి, ఆర్యవైశ్య నాయకులు పట్నాల గణపతి, కాపు నాయకులు ఆకుల సతీష్‌నాయుడు, మండపేట నియోజకవర్గంలో పారిశ్రామికవేత్త సుబ్బారాయుడు, ఆయన కుమారుడు చింతా వెంకటరెడ్డి వైఎస్సార్‌ సీపీలో జాయిన్‌ అయ్యారు. అనపర్తి నియోజకవర్గంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అద్దంకి ముక్తేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ కొవ్వూరి గోపాలకృష్ణారెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు వల్లూరి పరశురామచౌదరి తదితరులు వేలాదిమందితో కలిసి పార్టీలో చేరారు.
రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు కారం సావిత్రి, సీపీఎంకు చెందిన చింతూరు ఎంపీపీ చిచ్చడి మురళి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు దాకి శేషావతారం, ఏడుగురాళ్లపల్లి మాజీ సర్పంచ్‌ ఎడమ అర్జున, సీపీఎం నాయకులు కోట్ల కృష్ణ తదితరులు అధిక సంఖ్యలో వైఎస్సార్‌ సీపీలో చేరారు.
కాకినాడకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు, అడ్వొకేట్‌ గెద్దాడ వెంకటేశ్వరరావుతో కలిపి 25 మంది న్యాయవాదులు పార్టీలో చేరారు. రాజానగరం నియోజకవర్గానికి చెందిన గంగిశెట్టి సోమేశ్వరరావు, పిచ్చుకల విజయ్‌ తదితరులు, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆదర్శ ఇంజినీరింగ్‌ కళాశాల అధినేత బుర్రా అనుబాబు, కొత్తపల్లికి చెందిన మాస్టర్‌ వీవర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి కొప్పల మధుసూదనరావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మొగలి బాబ్జీ తదితరులు; తునిలో దేవస్థానం మాజీ చైర్మన్‌ దూలం మాణిక్యం; జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో వరుపుల రంగనాయకులు, సేవా సత్యనారాయణ, అల్లు విజయ్‌కుమార్‌ తదితర ప్రముఖులతోపాటు వందలాదిగా ద్వితీయ శ్రేణి నాయకులు జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఇలా పాదయాత్ర ఆద్యంతం పెద్ద ఎత్తున జరిగిన చేరికలతో, పాత, కొత్త నాయకుల కలయికతో జిల్లాలో వైఎస్సార్‌ సీపీ బలం మరింత పెరిగింది. జిల్లాలో వైఎస్సార్‌ సీపీ పటిష్టంగా ఉందని, ఆ పార్టీయే విజయదుందుభి మోగిస్తుందని దాదాపు అన్ని సర్వేలూ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీని విజయపథాన నడిపించేందుకు పార్టీ శ్రేణులు నూతనోత్తేజంతో కదం తొక్కున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement