విజయసాయిరెడ్డి రేపు రాక | YSR Congress chief secretary Vijaya sai reddy tour in Eluru | Sakshi
Sakshi News home page

విజయసాయిరెడ్డి రేపు రాక

Published Mon, May 25 2015 1:10 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

విజయసాయిరెడ్డి రేపు రాక - Sakshi

విజయసాయిరెడ్డి రేపు రాక

 ఏలూరు (ఆర్‌ఆర్ పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. ఏడాది పాలనలో టీడీపీ సర్కారు వైఫల్యాలను, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేం దుకు మంగళవారం జిల్లాలోని రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, ప్రజల తరపున పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా, నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
 
 వచ్చే నెల 3, 4 తేదీల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించ తలపెట్టిన సమర దీక్షను విజయవంతం చేయడానికి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చలు నిర్వహిస్తారు. సమర దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరిస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్‌లో గల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకుంటారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పాల్గొనే ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమానికి రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement