చోడవరం/ పులివెందుల : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గుంటూరులో వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా విశాఖ జిల్లా చోడవరంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో భీమిలి-నర్సీపట్నం రోడ్డుపై చోడవరం జంక్షన్ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.
అలాగే వైఎస్సార్ జిల్లా పులివెందులలో కదిరి రింగ్ రోడ్డు, ముద్దనూరు రింగ్ రోడ్డుల వద్ద కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డిల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.జగన్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు, అభిమానులు నాలుగు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగిన సంగతి తెల్సిందే.
జగన్ దీక్షకు మద్దతుగా రోడ్లపై వంటావార్పు
Published Sun, Oct 11 2015 12:27 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement