డీజీపీని కలిసిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు | ysrcp leaders met AP DGP sambasivarao | Sakshi
Sakshi News home page

డీజీపీని కలిసిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు

Published Wed, May 24 2017 7:31 PM | Last Updated on Tue, Oct 30 2018 4:51 PM

ysrcp leaders met AP DGP sambasivarao

విజయవాడ: ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు బుధవారం డీజీపీ సాంబశివరావును కలిశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు ఈ సందర్భంగా డీజీపీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్యాయంగా వైఎస్‌ఆర్‌ సీపీ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు.

గుంటూరు జిల్లా ఘటనపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయడానికి స్థానిక పోలీసులు మూడుసార్లు ఎఫ్‌ఐఆర్‌ను మార్చారన్నారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు. పార్టీ నేత మర్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ... టీడీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, అధికార పార్టీ నాయకులే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement