
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనూహ్య రీతిలో నిరసన తెలిపారు. నెల్లూరులోని ఒక వీధిలో మురికి కాలువపై వంతెన నిర్మించాలని కోరుతూ ఏకంగా మురుగులోకి దిగి నిరసన తెలియజేశారు. మురుగు కాలువపై వంతెన నిర్మించాలని స్థానికులు చాలా కాలంనుంచి అడుగుతున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి స్థానిక ఎమ్మెల్యే తీసుకెళ్లినప్పటికి ఎవరూ స్పందించలేదు.
దీంతో శ్రీధర్ రెడ్డి ఏకంగా సమస్యగా మారిన మురుగు కాలువలోకి దిగి నిలబడ్డారు. అధికారులు వచ్చే వరకు తాను మురుగు కాలువలోనే ఉంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే అలా మురుగు కాలువలో ధర్నాకు దిగడంతో స్థానికులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మురుగు కాలువలో నిరసన తెలుపుతున్న విషయం తెలుసుకున్న అధికారులు నానా హైరానా పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment