సాక్షి, విజయవాడ: సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లతో పెన్షన్లను డోర్ డెలివరీ చేసే వినూత్న విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం ఆయన సెంట్రల్ నియోజకవర్గం ఆరండల్‌పేట కమ్యూనిటీ భవనంలో కొత్తగా మంజూరయిన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్లు కోసం వృద్ధులు పడిగాపులు పడాల్సి వచ్చేందని.. అటువంటి వ్యవస్థను సీఎం జగన్ ప్రభుత్వం ప్రక్షాళన చేసిందని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో ఒక్కసారి మాత్రమే పెన్షన్ పెంచారని, జన్మభూమి కమిటీలు పేరుతో లంచాలు దండుకునేవారని ఆయన దుయ్యబట్టారు. (ఆంధ్రజ్యోతి వాహనం సీజ్)
విజయవాడ నగరంలో 55 వేల పింఛన్లు లబ్ధిదారులకు ఒక్కరోజులోనే వాలంటీర్లు అందించారని పేర్కొన్నారు. 96 శాతం డోర్ డెలివరీ చేశారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని.. గత ఐదేళ్లలో ప్రజలకు టీడీపీ ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి మహానాడు కోసమే వచ్చారని, విశాఖ ఘటన సాకుగా చూపి మహానాడు నిర్వహించి..మళ్లీ తిరిగి హైదరాబాద్‌కు వెళ్ళిపోయారన్నారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని విమర్శించారు. (గ్రామ వాలంటీర్ గొప్పతనం)
వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత, నైతిక హక్కు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కు లేదని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటున్నాయని.. కన్నా మాత్రం కించపరిచేలా మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment