అప్రాధాన్యంగా బడ్జెట్ కేటాయింపులు
వైఎస్సార్ సీపీ శాసనభా పక్షం మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అప్రాధాన్యంగా ఉందని వైఎస్సా ర్ సీపీ శాసనసభా పక్షం ధ్వజమెత్తింది. ఫీజు రీయింబర్స్‌మెంటు కు నిధుల్ని అరకొరగా కేటాయిం చి వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా అధికార పార్టీ వ్యవహరి స్తోందని దుయ్యబట్టింది. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొడాలి నాని, జలీల్‌ఖాన్, ముస్తఫా, రక్షణనిధిలు మాట్లాడారు. వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం సమన్వయకర్త శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంటుకు రూ.4,400 కోట్లు కావా ల్సి ఉంటే, బడ్జెట్‌లో కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు.