
జిల్లా పరిషత్ సీఈఓకు బదిలీ
విజయనగరం ఫోర్ట్: జిల్లా పరిషత్ సీఈఓ నేపల మోహనరావుకు బదిలీ అయ్యింది. ఆయన స్థానంలో సీఈఓగా గనియా రాజకుమారిని ప్రభుత్వం నియమించింది. మోహనరావు జిల్లా పరిషత్ సీఈఓగా 2012 జూలై 5వతేదీన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో రెండేళ్ల నాలుగు నెలల పాటు పనిచేశారు. ఈయనకు ఇంకా పోస్టు కేటాయించాల్సి ఉంది. నూతన సీఈఓగా నియమితులైన రాజకుమారికి ఇదివరకే జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది. విజయనగరం ఆర్డీఓగా, డీసీసీబీలో ఆమె ఇక్కడ పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేస్తున్నారు.