పలు ప్రముఖ యాప్‌లను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించేసింది. తన పాలసీలను ఉల్లంఘించే బ్యాడ్ యాప్స్‌కు వ్యతిరేకంగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో సరహా మెస్సేజింగ్ యాప్ కూడా ఉంది. సరహాతో పాటు ఇతర పాపులర్ యాప్స్ అమెజాన్ అండర్‌గ్రౌండ్,గ్రూవ్స్ షార్క్, పీఎస్ఎక్స్4డ్రాయిడ్, రష్ పోకర్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో స్థానం కోల్పోయాయి. సరహా అనేది తామెవరో తెలిసే అవకాశం లేకుండానే ఎదుటి వారికి సందేశాలు పంపుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీంతో వేధింపులకు ఇదో మాధ్యమంగా మారిపోయింది. దీనిపై యూజర్ల నుంచి కూడా భారీగానే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించేయాలని నిర్ణయించింది.
ట్యూబ్ మేట్ అనే యాప్‌పై కూడా గూగుల్ వేటు వేసింది. ఈ యాప్ యూట్యూబ్ నుంచి వీడియోలను నేరుగా యూజర్ల ఫోన్లలోకి డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇదే గూగుల్‌కు నచ్చలేదు. యూట్యూబ్ వీడియోలను నచ్చినప్పుడు చూసుకోవడానికే మాత్రమే అవకాశం ఉంది. డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు లేదు. సీఎం ఇన్ స్టాలర్ కూడా గూగుల్ ప్లే స్టేర్‌లో స్థానం కోల్పోయింది. నచ్చిన టీవీ షోను చూసుకునేందుకు వీలు కల్పించే టీవీ పోర్టల్ యాప్‌ను కాపీరైట్ ఉల్లంఘనల అంశం కింద గూగుల్ నిషేధించింది. యాడ్ బ్లాకర్ అనే మరో యాప్‌ను కూడా గూగుల్ తన వ్యాపార కోణాల రీత్యా నిషేధించింది. ఈ యాప్ ప్రకటనలను బ్లాక్ చేసేస్తుంది. గ్రూవ్స్ షార్క్, పీఎస్ఎక్స్4డ్రాయిడ్, రష్ పోకర్, అమేజాన్ అండర్ గ్రౌండ్ తదితర యాప్ లు కూడా ప్లే స్టోర్ నుంచి స్థానం కోల్పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment