న్యూఢిల్లీ: తయారీ, ఐటీ, రవాణా సహా ఎనిమిది కీలక రంగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలంలో నికరంగా 1.36 లక్షల ఉద్యోగాలు అదనంగా ఏర్పడినట్టు కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో నిర్వహించిన త్రైమాసిక వారి సర్వేలో వెల్లడైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఉద్యోగాలు నష్టపోయినది నిర్మాణ రంగం ఒక్కటే. ఈ రంగంలో 22,000 ఉద్యోగాలు తగ్గిపోయాయి. తయారీ రంగంలో 89,000, విద్యా రంగంలో 21,000, రవాణా రంగంలో 20,000, వర్తకంలో 14,000, ఆరోగ్య రంగంలో 11,000 ఉద్యోగాలు పెరిగాయని ఈ సర్వే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment