రెండేళ్లలో 16 కోట్ల రూపాయి నోట్ల ముద్రణ | 16 crore rupee notes printed in two years | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో 16 కోట్ల రూపాయి నోట్ల ముద్రణ

Published Mon, Jan 4 2016 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

రెండేళ్లలో 16 కోట్ల రూపాయి నోట్ల ముద్రణ

రెండేళ్లలో 16 కోట్ల రూపాయి నోట్ల ముద్రణ

ముంబై: ఆర్థిక శాఖ గత రెండేళ్లలో 16 కోట్ల రూపాయి నోట్లను జారీ చేసింది. ఈ నోట్ల ముద్రణ ఆపేసిన దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో  రూపాయి నోట్లను జారీ చేసింది. 1994-95లో దాదాపు 4 కోట్ల రూపాయి నోట్ల ముద్రణయ్యాయని, ఒక్కో నోటుకు ముద్రణ వ్యయం రూ.1.48 అయిందని,  ఆ తర్వాత ఈ నోట్లను ముద్రించలేదని ప్రభుత్వం తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 50 లక్షలు, ఈ ఏడాదిలో 15.5 కోట్లు చొప్పున రూపాయి నోట్లను ముద్రించామని పేర్కొంది. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు వెల్లడయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement