సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే టిక్కెట్ల బుకింగ్స్‌కు ఆధార్ నెంబర్ తప్పనిసరి కాదని భారతీయ రైల్వే బుధవారం ధృవీకరించింది. రైలు ప్రయాణం కోసం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సినవసరం లేదని, కానీ స్వచ్ఛదంగా దీన్ని సమర్పించడాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పింది. రైల్వేశాఖ సహాయమంత్రి రాజేన్ గోహైన్ ఈ విషయాన్ని లోక్‌సభలో తెలిపారు. టిక్కెట్ల బుకింగ్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేసే ప్రతిపాదనేమీ తమ వద్ద లేదని తెలిపారు.
సీనియర్ సిటిజన్లు రైల్వే టిక్కెట్ల బుకింగ్‌పై రాయితీని పొందడానికి ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోవడాన్ని జనవరి 1 2017 నుంచి ప్రవేశపెట్టారు. ఇది కూడా స్వచ్ఛందంగానే చేపడుతున్నట్టు మంత్రి లోక్‌సభలో రాతపూర్వకంగా తెలిపారు. అయితే ఆధార్ ద్వారా బుకింగ్‌లను ప్రోత్సహించేందుకు రైల్వే ఇటీవలే ఆధార్ ఉంటే నెలలో 12 వరకూ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపినట్టు పేర్కొన్నారు. ఐఆర్‌సీటీసీలో యూజర్ ఐడీకి ఆధార్ లింక్ చేస్తే, రివార్డు స్కీమ్‌ను కూడా ఐఆర్‌సీటీసీ ప్రవేశపెట్టినట్టు మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment