ఆ బ్యాంకుకు రూ. 743 కోట్ల నష్టాలు
ప్రభుత్వ రంగంలోని అలహాబాద్ బ్యాంకు భారీ నష్టాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 620.90 కోట్ల నికర లాభాలు సాధించిన ఈ బ్యాంకు.. ఈసారి ఏకంగా రూ. 743.31 కోట్ల నికర నష్టాల్లోకి జారిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నిరర్ధక రుణాలు రూ. 2,856.66 కోట్ల నుంచి రూ. 5,253.19 కోట్లకు పెరిగాయి.
కానీ ఈ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్థూల నిరర్ధక రుణాలు రూ. 15,384.57 కోట్లుగాను, నికర నిరర్ధక రుణాలు రూ. 10,292.51 కోట్లుగాను తేలాయి. వీటి ఫలితంగానే అలహాబాద్ బ్యాంకు తీవ్ర నష్టాలలో మునిగిపోయింది.