న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రెపోను ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందని కొటక్ ఇన్‌స్టిట్యూషన్ ఈక్విటీస్ తాజా పరిశోధనా పత్రంలో పేర్కొం ది. ఆర్‌బీఐ అక్టోబర్ 4న రెపో రేటును పావు శాతం తగ్గించింది. డిసెంబర్ 6, 7 తేదీల్లో తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం జరగనుంది.