భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా ఉందని, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అధిక సవాళ్లకు ...
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా ఉందని, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అధిక సవాళ్లకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ద్రవ్యోల్బణం, ఫారెక్స్ నిల్వలు, ఇన్‌ఫ్రా రంగంలో మూలధన పెట్టుబడులు, ఆదాయ వసూళ్లు వంటి దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించే అన్ని అంశాలు సానుకూలంగా ఉన్నాయని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు.
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని ఆయన చెప్పారు. ఉక్కు పరిశ్రమ ఒత్తిళ్లకు లోనుకావడంతో బ్యాంకుల ఎన్‌పీఏలు పెరిగాయని తెలిపారు.