ఎగుమతుల జోరు | Exports log double-digit growth in February | Sakshi
Sakshi News home page

ఎగుమతుల జోరు

Published Thu, Mar 16 2017 1:22 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM

ఎగుమతుల జోరు

ఎగుమతుల జోరు

ఎగుమతులు ఫిబ్రవరిలో పరుగులు తీశాయి. గత ఆరు నెలల కాలంలో అత్యధిక స్థాయిలో 17.48 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

ఫిబ్రవరిలో 17 శాతం వృద్ధి
24.5 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు


న్యూఢిల్లీ: ఎగుమతులు ఫిబ్రవరిలో పరుగులు తీశాయి. గత ఆరు నెలల కాలంలో అత్యధిక స్థాయిలో 17.48 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 24.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్, రసాయనాల ఎగుమతులు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. అదే సమయంలో దిగుమతులు సైతం పెరగడంతో దేశ వాణిజ్య లోటు 8.89 బిలియన్‌ డాలర్లకు విస్తరించింది. గతేడాది ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 6.57 బిలియన్‌ డాలర్లుగానే ఉంది.

గతేడాది సెప్టెంబర్‌ తర్వాత మొదటి సారి ఎగుమతుల్లో రెండంకెల సానుకూల వృద్ధి నమోదైందని వాణిజ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక దిగుమతులు ఫిబ్రవరిలో 21.76% అధికంగా 33.38 డాలర్ల మేర జరిగాయి. 2016 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎగుమతుల్లో వృద్ధి 2.52%గా ఉందని, 245బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని వాణిజ్య శాఖ వెల్లడించింది. దిగుమతులు 3.67% తగ్గి 340.7 బిలియన్‌ డాలర్లకు పరిమితం అయ్యాయి. 11 నెలల కాలంలో వాణిజ్య లోటు 95.28 డాలర్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement