
ఈక్విటీ మార్కెట్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రాబడులు కూడా అలానే ఉంటాయి మరి. అయితే, ఈక్విటీల్లో రిస్క్ కొంత తక్కువ ఉండాలనుకునే వారికి లార్జ్‌క్యాప్ విభాగం అనుకూలం. లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి ముందున్న ఎంపికల్లో హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 100 మ్యూచువల్ ఫండ్ పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మార్కెట్ పతనాలను ఎన్నింటినో చూసి ఉన్నది. రాబడుల విషయంలో మంచి ట్రాక్ రికార్డు కూడా ఈ పథకంలో గమనించొచ్చు.
రాబడులు
ఈ పథకం గత ఏడాది కాలంలో మంచి పనితీరు ప్రదర్శించింది. ఎందుకంటే గత ఏడాది, ఏడాదిన్నర కాలంలో ప్రధానంగా బ్లూచిప్ కంపెనీలు మంచి ప్రదర్శన చూపడమే. లార్జ్‌క్యాప్ ఈక్విటీ డైవర్సిఫైడ్ విభాగంలో ఉత్తమ పనితీరు చూపించిన పథకం ఇదే కావడం గమనార్హం. గత ఏడాది కాలంలో పోటీ పథకాలైన యాక్సిస్ బ్లూచిప్ ఫండ్, రిలయ¯Œ ్స లార్జ్‌క్యాప్, ఆదిత్య బిర్లా స¯Œ లైఫ్ ఫ్రంట్‌లై¯Œ ఈక్విటీ కంటే హెచ్‌డీఎఫ్‌సీ టాప్100 ముందున్నది. మూడేళ్లలో ఈ పథకం వార్షికంగా 16.2 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 10.9 శాతం, పదేళ్లలో 13.4 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్నిచ్చింది. నిఫ్టీ 100 మూడేళ్లలో 14.8 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 11.3 శాతం చొప్పున ఉన్నాయి. సుదీర్ఘకాలంగా మార్కెట్లో ఉన్న ఈ పథకం 2015, 2016 సంవత్సరాల్లో మాత్రం ఆశించిన పనితీరు చూపలేదు. కానీ, 2017లో మాత్రం తిరిగి మంచి పనితీరుతో ముందున్నది. తక్కువ రిస్క్ కోరుకునే వారు ఈ పథకంలో దీర్ఘకాలం పాటు, సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రిస్క్‌ను అధిగమించి మెరుగైన రాబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.
పోర్ట్‌ఫోలియో, విధానం
ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్ ఎన్నో ఏళ్ల ర్యాలీ అనంతరం ఈ పథకం తన ప్రాధాన్యంలో మార్పు చేసింది. కార్పొరేట్ బ్యాంకులు, ఇండస్డ్రియల్స్, యుటిలిటీలు, ఐటీ రంగాలకు 2017లో ప్రాధాన్యాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ రంగాల్లోనే ఎక్కువ ఎక్స్‌పోజర్ కలిగి ఉంది. ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాల్లో స్టాక్స్ వ్యాల్యూషన్లు ఎక్కువగా ఉండడం, డిమాండ్ బలహీనంగా ఉండడం వంటి కారణాలతో తక్కువ వెయిటేజీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 50 స్టాక్స్ ఉన్నాయి. మొత్తం పెట్టుబడుల్లో 97.44 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు నిల్వల రూపంలో కలిగి ఉంది. బ్లూచిప్ కంపెనీలకు 90.5 శాతం వరకు పెట్టుబడులను కేటాయించగా, మరో 9.5 శాతం మేర మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలకు పెద్ద పీట వేసింది. ఈ రంగాల్లో 37.5 శాతం పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఎనర్జీ స్టాక్స్‌కు 23.69 శాతం, టెక్నాలజీకి 13 శాతం పెట్టుబడులను కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment