పన్ను వ్యవస్థలో సమూల మార్పులకు టాస్క్‌ఫోర్స్‌ | Government sets up a panel to draft new direct tax law  | Sakshi
Sakshi News home page

పన్ను వ్యవస్థలో సమూల మార్పులకు టాస్క్‌ఫోర్స్‌

Published Wed, Nov 22 2017 8:06 PM | Last Updated on Wed, Nov 22 2017 8:06 PM

Government sets up a panel to draft new direct tax law  - Sakshi - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో మారుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా 50 ఏళ్ల కిందటి ఆదాయ పన్ను చట్టాన్ని మార్చేందుకు ప్రభుత్వం బుధవారం టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది.ఆరుగురు సభ్యులుండే ఈ టాస్క్‌ఫోర్స్‌లో సీబీడీటీ సభ్యులు అరవింద్‌ మోదీ కన్వీనర్‌గా ఉంటారు. చార్టెడ్‌ అకౌంటెంట్‌ గిరీష్‌ అహుజా, యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఛైర్మన్‌, రీజినల్‌ మేనేజర్‌ రాజీవ్‌ మెమాని, ఐసీఆర్‌ఐఈఆర్‌ కన్సల్టెంట్‌ మన్సి కేడియా సభ్యులుగా ఉంటారు.

ఐదు దశాబ్థాలకు పైబడిన ఆదాయ పను​ చట్టాన్ని రీడ్రాఫ్ట్‌ చేయాల్సిన అవసరం ఉందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ట్యాక్స్‌ అధికారుల వార్షిక సదస్సులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదాయ పన్ను చట్టం, 1961ని సమీక్షించి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను నియమించిందని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

టాస్క్‌ఫోర్స్‌ ఆరు నెలల్లోగా ప్రభుత్వానికి తన నివేదిక సమర్పిస్తుంది. టాస్క్‌ఫోర్స్‌లో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement