
జీఎస్టీ.. బిజీబిజీ
♦ అమలుకు వాణిజ్య పన్నుల శాఖ సమాయత్తం
హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు కేవలం రెండ్రోజులే (జూలై 1) గడు వున్న నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖలో హడావుడి కనిపిస్తోంది. పన్ను చెల్లించే డీలర్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతోపాటు కొత్త విధానం అమలు బాధ్యతలను కేంద్ర అధికారు లతో (సెంట్రల్ ఎక్సైజ్) పంచుకోవడం, పని విభజన వంటి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ అధీనంలోని 19 సరిహద్దు చెక్‌పోస్టులను జూన్ 30 తర్వాత ఎత్తివేయాలని అధికారులు నిర్ణ యించారు. ఈ చెక్‌పోస్టుల స్థానంలో మొబైల్ బృందాలతో తనిఖీలు చేపట్టాలని ప్రతిపాదిం చారు. చెక్‌పోస్టుల ఎత్తివేత కార్యక్రమం దేశ వ్యాప్త విధానం కావడంతో మొబైల్ తనిఖీ బృందాల ఏర్పాటు కోసం జీఎస్టీ కౌన్సిల్ మార్గ దర్శకాలను అమలు చేయనున్నారు.
బాధ్యతలు పంచుకున్నారిలా...
పెట్రోల్, మద్యం మినహా అన్ని వస్తువులపై జీఎస్టీ అమలు చేయాల్సిన నేపథ్యంలో ఈ అమలు బాధ్యతలను సెంట్రల్ ఎక్సైజ్, వాణి జ్య పన్నుల శాఖ అధికారులు పంచుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ కేవలం వస్తు పన్ను మాత్రమే వసూలు చేస్తోంది. జీఎస్టీ అమలుతో వస్తు పన్నుతో పాటు సేవల పన్నును కూడా వసూలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఏడాదికి రూ.1.50 కోట్ల టర్నోవర్ కన్నా ఎక్కువ ఉండే డీలర్లను వాణిజ్య పన్నుల శాఖ, సెంట్రల్ ఎక్సై జ్ అధికారులు చెరి సగం పంచుకుని జీఎస్టీ అమలును పర్యవేక్షించనున్నారు. రూ.1.50 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉండే డీలర్లలో 90% మంది వాణిజ్య పన్నుల శాఖ కిందకు రాగా..10% సెంట్రల్ ఎక్సైజ్ అధికారుల పరి ధిలోకి వెళ్లారు. ఏ శాఖ పరిధిలోకి వచ్చే డీలర్లకు సంబంధించిన పన్ను వసూలు, పర్యవేక్షణ బాధ్యతలను ఆ శాఖ అధికారులే చూడను న్నారు. చెక్‌పోస్టుల స్థానంలో రానున్న మొబైల్ తనిఖీ బృందాల విషయంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర అధికారుల నిఘా ఉంటుంది.
డీలర్లు ఏం చేయాలంటే...
జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించాలనుకునే డీలర్లు తొలుత పాత పన్నుల విధానం నుంచి జీఎస్టీ పరిధిలోకి రావాలి. అంటే.. ప్రభుత్వం ఇచ్చే జీఎస్టీ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకుని, సర్టిఫికెట్ పొందిన తర్వాత సదరు డీలర్‌కు ఆ శాఖ అధికారులు 15 అంకెల జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తారు. ఆ నంబర్లు తెలంగాణ కోడ్ (36)తో ప్రారంభం కానున్నాయి. 36 తర్వాత ఆ డీలర్ పాన్ నంబర్, ఇతర కోడ్‌లు ఉంటాయి. ఈ నంబర్‌తో లాగిన్ అయితేనే వ్యాపార లావాదేవీలకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు తెలంగాణలో దాదాపు 86 శాతం మంది జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ పొందారని, మిగిలినవి కూడా మరో మూడ్రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ కింద వ్యాపార లావాదేవీల కోసం డీలర్లు తమ ఇన్‌వాయిస్‌లను కూడా పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది.
అధికారుల కోసం ప్రత్యేక సిగ్నేచర్
జీఎస్టీ అమలు కోసం వాణిజ్య పన్నుల శాఖ పని విధానంలో కూ డా మార్పులు జరగబోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ము ఖ్యంగా ఏసీటీవో స్థాయి నుంచి కమిషనర్ స్థాయి వరకు అందరు అధి కారులకు డిజిటల్ సిగ్నేచర్‌లు ఇస్తున్నారు. వీరికి పెన్‌డ్రైవ్ తరహాలో ఉండే ప్రత్యేక ‘కీ’ కూడా ఇవ్వనున్నారు. ఈ కీతోపాటు డిజిటల్ సిగ్నే చర్ ద్వారా లాగిన్ అయితేనే సదరు అధికారి అటెండెన్స్ నమోదవు తుందని చెబుతున్నారు. అలా నమోదైన అధికారికి ఆ రోజు నిర్వర్తిం చాల్సిన ముఖ్య విధులను కూడా సూచించేలా సాఫ్ట్‌వేర్ రూపొందిం చారని తెలుస్తోంది.
ఆ విధులను సదరు అధికారి నిర్వర్తించని పక్షంలో ఉన్నతాధికారికి ఆ విషయాన్ని చేరవేసే వ్యవస్థ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే జీఎస్టీ అమలు నేపథ్యంలో తమపై పని ఒత్తిడి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతినెలా రాష్ట్రంలో జరిగే వ్యాపార లావాదేవీలకు సంబంధించి 2 కోట్లకు పైగా ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని, గతంలో మాదిరిగానే రిటర్న్స్ స్క్రూటినీ, ఆడిట్, అసెస్‌మెంట్, రిటర్న్ డిఫాల్టర్ల పర్యవేక్షణ, మిస్‌మ్యాచ్ రిపోర్టులు వంటివి నిర్వర్తించాల్సి రావడం, వస్తు పన్నుకు సంబంధించిన డీలర్లు తగ్గినా, సేవల పన్ను చెల్లించే డీలర్లు తమ పరిధిలోనికి రావడంతో అదనపు పనిభారం పడుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ శాఖలో పని ఉండదనేందుకు అవకాశం లేదని, ఆన్‌లైన్ ద్వారా అంతా జరిగినా దాని పర్యవేక్షణ చూడాల్సింది తామేనని చెబుతున్నారు.
నేడు కమిషనర్‌తో జేఏసీ భేటీ
జీఎస్‌టీ అమలు తేదీ దగ్గరకొస్తున్నా.. ఉద్యోగుల్లో దీనిపై భయాలు అలానే కొనసాగుతున్నాయి. క్యాడర్‌ను దీనికి అనుగుణంగా పునర్వ్యవస్థీక రించాలని, ఆన్‌లైన్ అమలుకు తగ్గ మౌలిక సదుపాయాలు కల్పించాలని కమర్షియల్ ట్యాక్స్ విభాగం కోరినా ఇంతవరకూ స్పందన లేదు. ఉద్యోగులకు జాబ్‌చార్ట్ కూడా రాలేదని తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ యాక్షన్ కమిటీ వాపోయింది. దీనిపై తాము బుధవారం ఉదయం 11.30 గంటలకు కమి షనర్‌ను కలవనున్నామని, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రికి కూడా తమ డిమాండ్లను అంద జేస్తామని తెలియజేసింది. భవిష్యత్ కార్యాచ రణను నిర్ణయిస్తామని తెలంగాణ వాణిజ్య పన్నుల గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీజీ టీఓఏ) అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి తెలిపారు.