ఏపీ, తెలంగాణ, అసోంలో హెటెరో కొత్త యూనిట్లు
ముంబై: హెటెరో డ్రగ్స్‌లో భాగమైన హెటెరో హెల్త్‌కేర్ తన ఫార్ములేషన్ల వ్యాపార విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం రాష్ట్రాల్లో కొత్తగా మూడు యూనిట్లు ఏర్పాటు చేయనుంది. దేశీయ మార్కెట్‌కు ఫార్ములేషన్ల సరఫరా కోసం ఈ మూడు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఏపీలో ఏర్పాటు చేస్తున్న నూతన యూనిట్‌లో డిసెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, ఇక్కడ ఇంజెక్టబుల్స్‌ను తయారు చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
అసోంలోని గువాహటి ప్లాంట్ పనులు 75% పూర్తయ్యాయని వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం అవుతుందని వెల్లడించింది. ఇక్కడ టాబ్లెట్లు, క్యాప్సుల్స్ తయారవుతాయని పేర్కొంది. అయితే, తెలంగాణ యూనిట్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పడుతుందని హెటెరో హెల్త్‌కేర్ స్పష్టం చేసింది. ఈ మూడు యూనిట్ల ద్వారా కంపెనీ ఆదాయం 20 నుంచి 25%పెరుగుతుందని పేర్కొం ది. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా హెపటైటిస్, ఆంకాలజీ, హెచ్‌ఐవీ విభాగాల్లో నూతన మాలిక్యూల్స్‌పై దృష్టి పెట్టినట్టు కంపెనీ తెలిపింది.
ఫార్ములేషన్లను తయారు చేసే దేశ, విదేశీ ఫార్మా కంపెనీలకు అతిపెద్ద ముడి పదార్థాల (ఏపీఐ) సరఫరాదారు హెటెరో. దేశంతోపాటు విదేశాల్లో కలిపి కంపెనీకి 25 తయారీ కేంద్రాలున్నాయి. తాను తయారు చేస్తున్న ఏపీఐ, ఫార్ములేషన్లలో 60 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తోంది. హెచ్‌ఐవీ ఔషధాల్లో 30 శాతం వాటాతో ప్రపంచ లీడర్‌గా ఉంది.